ఏపీ అసెంబ్లీని కుదిపేసిన మోహన్ బాబు సినిమా ఏంటో తెలుసా?

మోహన్ బాబు.డైలాగ్ కింగ్, కలెక్షన్ కింగ్ అనే బిరుదులతో తెలుగు సినిమా పరిశ్రమను దుమ్మురేపాడు.

ఆయన కేరీర్ లో ఎన్నో సూపర్ డూపర్ హిట్ సినిమాలను అందుకున్నాడు.అంతేకాదు.

తను నటించిన చాలా సినిమాలు ఇండస్ట్రీ హిట్లు అందుకున్నాయి కూడా.అలా బ్లాక్ బస్టర్ కొట్టిన సినిమాల్లో ఒకటి అసెంబ్లీ రౌడీ.

అప్పట్లో ఈ సినిమా కనీ వినీ ఎరుగని రీతిలో హిట్ అయ్యింది.అంతేకాదు.

Advertisement

తెలుగు సినిమా చరిత్రలో ఎప్పటికీ ఈ సినిమాకు ఓ ప్రత్యేక స్థానం ఉంటుందని చెప్పుకోవచ్చు.ఈ సినిమా అప్పట్లో ఎన్నో సంచలనాలకు వేదిక అయ్యింది.

పొలిటికల్ వార్ కు తెర తీసింది.శ్రీ లక్ష్మీ ప్రసన్న పిక్చర్స్ బ్యానర్ పై మోహన్‌బాబు ఈ సినిమాను నిర్మించాడు.

బి.గోపాల్ ఈ సినిమాకు దర్శకత్వం చేశాడు.వాస్తవానికి ఈ సినిమా స్ట్రెయిట్ మూవీ కాదు.

కోలీవుడ్ లో సత్యరాజ్ హీరోగా శ్రీవాసు దర్శకత్వంలో ఈ సినిమాను చేశారు.అక్కడ మంచి విజయాన్ని అందుకుంది.

ఇదేందయ్యా ఇది.. కట్టెల పొయ్యిపై రొట్టెలు చేస్తున్న హీరోయిన్..
సినిమా వాళ్ళ దెబ్బకి విశ్వక్ సేన్ అడ్రస్ మార్చేశాడట !

అదే సినిమాను తెలుగులోకి రీమేక్ చేశారు.దాని పేరు అసెంబ్లీ రౌడీ అని చెప్పారు.

Advertisement

అయితే ఈ సినిమా టైటిల్ అప్పట్లో సంచలనంగా మారింది.ఏపీ అసెంబ్లీని మూడు రోజుల పాటు ఈ సినిమా పేరు కుదిపేసింది.

కొందరు ఎమ్మెల్యేలు ఈ సినిమా తమకు వ్యతిరేకంగా ఉందని భావించారు.అసెంబ్లీ రౌడీ అని పేరు ఎలా పెడతారు? ఈ సినిమాను బ్యాన్ చేయాలని చాలా మంది డిమాండ్ చేశారు.అసెంబ్లీలో ఉన్న వాళ్లమంతా రౌడీలమా? అంటూ మండిపడ్డారు.అయితే అప్పుడు స్పీకర్ గా ఉన్న ఆలపాటి ధర్మారావు ఈ సినిమా చూశాడు.

కేవలం టైటిల్ మాత్రమే అసెంబ్లీ రౌడీ అని ఉందని.ఈ సినిమాలో ప్రజా ప్రతినిధులను కించపరిచే ఎలాంటి సన్నివేశాలు లేవని చెప్పాడు.

అప్పుడు ఎమ్మెల్యేలు సైలెంట్ అయ్యారు.అప్పుడు కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది.

ఏపీ అసెంబ్లీలో ఈ సినిమాపై జరిగిన లొల్లి మూలంగా తమకు మంచి పబ్లిసిటీ వచ్చిందని చెప్పాడు దర్శకుడు గోపాల్.వారి లొల్లే తమ సినిమా విజయానికి కారణం అయ్యిందన్నాడు.మోహన్ బాబు, దివ్య భారతి నటన, గోపాల్ టేకింగ్, పరుచూరి బ్రదర్స్ డైలాగులు ఈ సినిమా హిట్ కు కారణం అయ్యాయి.

తాజా వార్తలు