హీరోయిన్ అమల పాల్ గురించి మీకు తెలియని నిజాలివే..??

ప్రముఖ నటి అమల పాల్ గురించి తెలియని వారంటూ ఉండరు.ఆమె తన నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుంది.

ఇక అమల పాల్ వ్యక్తిగత విషయలోకి వెళ్తే ఆమె ఎర్నాకుళంలో 1991 అక్టోబ‌ర్ 26న జన్మించారు.అమ‌ల‌ త‌ల్లిపేరు అన్నీస్‌.

ఇక తండ్రి పాల్ వ‌ర్ఘీస్ క‌స్ట‌మ్స్ డిపార్ట్‌మెంట్‌లో ఉద్యోగిగా పని చేస్తుండేవారు.ఆయనకి ఇల్లు, ఆఫీస్ తప్ప వేరే ఏమి తెలియవు.

ఆయనకి సెల‌వులు దొరికితే పూర్తిగా ఫ్యామిలీతోనే గడిపేస్తుండేవారు.అయితే ఇండియాలో అమ‌ల పాల్గొనే షూటింగ్స్‌కు అమ్మ వెంట వ‌స్తే, విదేశాల్లో షూటింగ్స్‌కు తండ్రి వెంట వచ్చేవారంట.

Advertisement

ఇక అస‌లు అమ‌ల సినీన‌టి అయ్యిందంటే అది, అన్న‌య్య అభిజీత్ స‌పోర్ట్ తోనే ఆమె హీరోయిన్ గా మారిపోయింది.అయితే అత‌ను అమెరికాలో మ‌ర్చంట్ నేవీలో ప‌ని చేస్తున్నారు.

అంతేకాదు ఆయన ఎప్పుడు ఇంటికొచ్చినా అమ్మానాన్న‌లు, చెల్లెలి కోసం గిఫ్ట్‌లు తీసుకొస్తుండేవారు.ఇక చిన్నప్పటి నుండి అన్నాచెల్లెళ్ల‌కు సినిమాలంటే ఇష్టంగా చూసేవారంట.

అయితే నిజానికి వాళ్ల కుటుంబంలో ఎవ‌రూ సినీ ప‌రిశ్ర‌మ‌లో లేక‌పోయినా అమ‌ల‌కు న‌ట‌నాశ‌క్తి స్వ‌త‌హాగా అలవడింది లేదు.

అయితే అమ‌ల‌ హీరోయిన్ల‌లా త‌నూ అందంగా ఉండాల‌ని అద్దం ముందు గంట‌ల త‌ర‌బ‌డి నిల్చొని త‌న అందం చూసుకొని మురిసిపోయేది.అంతేకాదు దుస్తుల‌మీద త‌న‌కు ఎక్కువగా ఇంట్రెస్ట్ ఉండేది.ఇక వెరైటీ వెరైటీ డ్ర‌స్సులు వేసుకుంటూ ఉండేది.

పుష్పరాజ్ కూతురు కావేరిని తెగ ట్రోల్ చేస్తున్న నెటిజన్లు.. అసలేం జరిగిందంటే?
కాకినాడ సీపోర్ట్ వ్యవహారం .. సాయిరెడ్డి తో పాటు వీరికీ ఈడి నోటీసులు

ఇక టెన్త్ క్లాసులో స్కూల్లో ఫ్యాష‌న్ పోటీ పెడితే, అందులో అమ‌లే ఫ‌స్ట్‌ వచ్చింది.అయితే ఓసారి వాళ్ల కాలేజీకి పాపుల‌ర్ మ‌ల‌యాళీ ద‌ర్శ‌కుడు లాల్ జోస్ వచ్చారంట.

Advertisement

ఇక అమ‌ల‌ను చూసిన వెంట‌నే నా సినిమాలో న‌టిస్తావా? అన‌డిగారంట.

ఇక అలా అదో చిన్న బ‌డ్జెట్ ఫిల్మ్‌.అందులో ఆమెది స‌హాయ‌న‌టి పాత్ర‌లో నటించింది.ఇక ఈ విష‌యాన్ని అమ్మానాన్న‌ల‌కు భ‌యంభ‌యంగానే చెప్పగా.

ఇద్ద‌రూ వద్దు అని చెప్పారంట.అయితే కూతుర్ని ఇంజ‌నీర్‌గా చూడాల‌నేది వాళ్ల కోరిక.

ఇక అప్పుడు అమ‌ల సినిమాల్లోకి వెళ్తే మంచి గుర్తింపు వ‌స్తుంద‌ని వాళ్ల‌కు అభిజీత్ వారికీ నచ్చజెప్పారు.కాగా.

అమ‌ల‌ 2009లో నీల‌తామ‌ర చిత్రం ద్వారా సినీరంగంలో న‌టిగా అడుగుపెట్టింద.మైనా మూవీ ఆమె కెరీర్‌ను మ‌లుపు తిప్పింది అనే చెప్పలి.

తాజా వార్తలు