నడిచే కంప్యూటర్ ఫ్యామిలీ మ్యాన్ 2 చెల్లం సర్ వెనుకున్న బ్యాగ్రౌండ్ ఏంటి?

ది ఫ్యామిలీ మ్యాన్-2. ఇటీవల విడుదలై సంచన విజయం సాధించిన వెబ్ సిరీస్.

ఈ వెబ్ సిరీస్ చూసిన వాళ్లకు చెల్లం సర్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.ఇందులో కీ రోల్ చేసిన మనోజ్ బాజ్ పేయి కంటే ఈయన గురించే ఎక్కువ చర్చ జరుగుతోంది.

ఏం కావాలన్నా చిటికెలో చెప్తాడు చెల్లం సర్.నడిచే వికిపీయాడా అతడు.ఈ సీజన్ లో ఆయనే హైలెట్ అయ్యాడు.

ఇంతకీ ఈ చల్లం సర్ ఎవరు అనేది సోషల్ మీడియా తెగ చర్చ జరుగుతోంది.సోషల్ మీడియాలో ఈయన కోసం ఓ ఫ్యాన్ ఫాలోయింగ్ పేజి కూడా రన్ అవుతోంది.

Advertisement

ఇంతకీ ఈ చల్లం సర్ ఎవరనేది ఇప్పుడు తెలుసుకుందాం.ముదర్‌ కూడమ్‌ అనే తమిళ సీరియల్‌ ‌తో ఇండస్ట్రీలోకి తెరంగేట్రలం చేశాడు ఉదయ్‌ మహేశ్‌.

ఆయన కేవలం నటుడే కాదు.దర్శకుడు కూడా.

నాలై, చక్కర వియుగమ్ అనే సినిమాలను రూపొందించాడు.ఇప్పటి వరకు కూడా తెరకెక్కించారు.

ఇప్పటి దాకా 30 సినిమాల్లో నటించాడు.గతంలో వచ్చిన గుర్తింపు కంటే ది ఫ్యామిలీ మ్యాన్-2లో చేసిన చెల్లం సర్ పాత్రతో ఎన్నో రెట్లు ఎక్కువ కావడం విశేషం.

గేమ్ ఛేంజర్ విషయంలో తొలి అరెస్ట్.. వాళ్లకు సరైన రీతిలో బుద్ధి చెబుతున్నారా?
వ‌ర్షాకాలంలో ఆ జాగ్ర‌త్త‌లు తీసుకుంటే జ‌లుబు, దగ్గుకు దూరంగా ఉండొచ్చు!

తాజా వెబ్ సిరీస్ లో హీరోకి ఏ సమాచారం కావాలన్నా ఇట్టే చెప్పేస్తాడు.నిజానికి ఈ సీజన్ లో సీనియర్ ఆఫీసర్ దీపన్ పాత్ర కోసం ఆయన ఆడిషన్ లో పాల్గొన్నాడు.కానీ ఆ పాత్రలో నటించేందుకు మరో నటుడిని తీసుకున్నారు.

Advertisement

ఆ తర్వాత చెల్లం పాత్ర చేయాలని రాజ్ డీకే ఈయనకు ఆఫర్ ఇచ్చాడు.అందుకు ఓకే చెప్పాడు.

ప్రస్తుతం చెల్లం పాత్రతో ఓ రేంజిలో క్రేజ్ సంపాదించాడు ఉదయ్‌ మహేశ్‌.గతంలో తమిళనాడుకే పరిమితం అయిన ఇతడి పాపులారిటీ ప్రస్తుతం దేశ వ్యాప్తంగా విస్తరించింది.

అందరి చేత ప్రశంసలు పొందుతున్నాడు.

తాజా వార్తలు