ఉక్రెయిన్‌పై రష్యా సాగిస్తున్న దండయాత్రకు ఆ దేశం చిగురుటాకులా వణుకుతోంది.ఎక్కడ చూసినా మరణించిన సైనికుల మృతదేహాలు, తెగిపడిన శరీర భాగాలు, శిథిల భవనాలతో ఉక్రెయిన్ .
స్మశానంలా కనిపిస్తోంది.దీంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని ఆ దేశ వాసులు ఐరోపా దేశాలకు వలస వెళ్తున్నారు.
కన్నవారిని, పుట్టిన గ్రామాన్ని, అయిన వారిని అందరిని విడిచిపెట్టి.పరాయి దేశంలోనైనా ప్రాణాలతో వుంటే చాలని ఎలాగోలా దేశం విడిచిపోతున్నారు.
మరోవైపు యుద్ధం కారణంగా అతలాకుతలమైన ఉక్రెయిన్‌ను ఆదుకునేందుకు అంతర్జాతీయ సమాజం, పలు స్వచ్చంధ సంస్థలు ఆపన్న హస్తం అందిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో యునైటెడ్ సిక్స్ (United Sikhs) అనే ఎన్జీవో రంగంలోకి దిగింది.
ఐక్యరాజ్యసమితి అనుబంధ గుర్తింపు వున్న ఈ సంస్థ మానవ హక్కులు, న్యాయ సలహా సేవలను అందిస్తోంది.ఈ క్రమంలో ఉక్రెయిన్‌కు చేరుకున్న ఈ సంస్థ వాలంటీర్లు.దాదాపు రెండు వారాలుగా సహాయక చర్యలు చేపడుతున్నారు.యుద్ధం నుంచి తప్పించుకుని ప్రాణాలతో బయటపడిన శరణార్థులకు అత్యవసర సాయాన్ని వీరు అందిస్తున్నారు.

ఫిబ్రవరి 24న రష్యా సైనిక దాడి మొదలైన తర్వాత నుంచి నేటి వరకు ఉక్రెయిన్ నుంచి దాదాపు 3 మిలియన్ల మంది దేశం విడిచి పారిపోయారు.ప్రతి పది మంది ఉక్రేనియన్ శరణార్థులలో ఆరుగురు పోలిష్ సరిహద్దును దాటారు.అలాగే 17,91,111 మంది ఐరోపా దేశాలకు వలసపోయారు.యూఎస్, జర్మనీ, యూకే నుంచి వచ్చిన ఈ సంస్థ వాలంటీర్లు ఉక్రెయిన్ సరిహద్దుగా దగ్గరగా పోలాండ్‌లోని మెడికాలో రిలీఫ్ బేస్ క్యాంప్‌ను ఏర్పాటు చేశారు.
యునైటెడ్ సిక్స్ సంస్థ ఇప్పటి వరకు 1,00,000 మంది శరణార్ధులకు సేవ చేసినట్లు తెలిపింది.రోజువారీ అవసరాలతో పాటు భోజనం, పారిశుద్ధ్య వస్తు సామాగ్రి, నీరు, బట్టలు అందజేస్తున్నారు.







