కేంద్ర రోడ్డు రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ పై పొగడ్తల వర్షం కురిపించారు.మంగళవారం టీఐవోఎల్-2022 అవార్డుల కార్యక్రమంలో పాల్గొన్న గడ్కరీ ప్రసంగిస్తూ…1991లో ఆర్థిక మంత్రిగా మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని ఆర్థిక కష్టాల నుంచి గట్టేక్కించాయని అన్నారు.
లిబరల్ ఏకానమీ స్థాపించి… ఆర్థిక వ్యవస్థను కొత్త ఫుంతాలు తొక్కించారని.పేదలకు ఇది ఎంతో ఉపయోగపడిందని పేర్కొన్నారు.
మన్మోహన్ సింగ్ ప్రారంభించిన ఆర్థిక సంస్కరణల వల్ల మహారాష్ట్రలో మంత్రిగా తాను ఉన్నప్పుడు రోడ్లు నిర్మించుకోవడానికి డబ్బు సేకరించగలిగానని ఈ సందర్భంగా ఆయన తెలిపారు.మన్మోహన్ కి దేశం రుణపడి ఉంటుందని తెలిపారు.
లిబరల్ ఎకానమీ అనేది ఏ దేశ అభివృద్ధిలో అయినా ఎంతగానో దోహదపడుతుందని తెలియజేశారు.ఉదాహరణకు ఈ ఎకానమీ కలిగిన చైనా మంచి ఉదాహరణ అని చెప్పుకొచ్చారు.
దీంతో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ మాజీ ప్రధాని మన్మోహన్ పై చేసిన వ్యాఖ్యలు జాతీయ రాజకీయాల్లో సంచలనం రేపుతున్నాయి.







