ఇందిరా పార్క్ వద్ద కేంద్రమంత్రి కిషన్ రెడ్డి అరెస్ట్..!!

తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు కేంద్రమంత్రి కిషన్ రెడ్డిని( Kishan Reddy ) ఇందిరాపార్క్ ధర్నా చౌక్ వద్ద పోలీసుల అరెస్టు చేయడం జరిగింది.ఈరోజు ఉదయం 6 గంటల నుండి గురువారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలు దీక్ష చేయడానికి పూనుకున్న కిషన్ రెడ్డిని పోలీసులు బుధవారం సాయంత్రం అరెస్టు చేశారు.

 Union Minister Kishan Reddy Arrested At Indira Park , Bjp, Kishan Reddy-TeluguStop.com

గురువారం వరకు దీక్ష చేస్తానని తెలుపగా పోలీసులు మాత్రం ఈరోజు సాయంత్రం 6 గంటల వరకు మాత్రమే అనుమతి ఉందని చెబుతూ దీక్షను భగ్నం చేశారు.సాయంత్రం 6 గంటల తర్వాత కిషన్ రెడ్డికి పోలీసులకు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది.

ఈ క్రమంలో ఇందిరా పార్క్ ధర్నా చౌక్ ( Indira Park Dharna Chowk )వద్ద భారీగా పోలీసులు వచ్చి కిషన్ రెడ్డితో పాటు పలువురు బీజేపీ నాయకులను.అదుపులోకి తీసుకోవడం జరిగింది.

పోలీసులకు బీజేపీ ( BJP )కార్యకర్తలకు మధ్య తోపులాట జరిగింది.కిషన్ రెడ్డిని తీసుకెళ్తున్న సమయంలో బీజేపీ మహిళలు పలువురు నేతలు అడ్డుపడటంతో తీవ్ర తోపులాట మధ్య పోలీసులు అరెస్టు చేశారు.

దీక్ష చేస్తున్న సమయంలో కిషన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ దీక్షను ఆపడానికి ప్రయత్నిస్తే తీవ్ర పరిణామాలు ఉంటాయని హెచ్చరించారు.శాంతియుతంగా దీక్ష కొనసాగుతుంటే ఇబ్బంది ఏంటని పోలీసులను ప్రశ్నించారు.

ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసిన దీక్ష కొనసాగుతుందని పేర్కొన్నారు.ఈ క్రమంలో సాయంత్రం ఆరు తర్వాత అనుమతి లేదని పోలీసులు బలవంతంగా కిషన్ రెడ్డిని అరెస్టు చేయడం జరిగింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube