కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా తెలంగాణకు రానున్నారు. ఈ మేరకు మధ్యాహ్నం 1.25 గంటలకు హైదరాబాద్ లోని శంషాబాద్ ఎయిర్ పోర్టుకు ఆయన చేరుకోనున్నారు.

విమానాశ్రయం నుంచి నేరుగా నోవాటెల్ హోటల్ కు అమిత్ షా వెళ్లనున్నారు.అక్కడ మధ్యాహ్నం 1.40 గంటల నుంచి మధ్యాహ్నం 2.40 గంటల వరకు రాష్ట్ర బీజేపీ ముఖ్యనేతలతో ఆయన భేటీ కానున్నారు.తెలంగాణలో నెలకొన్న ప్రస్తుత రాజకీయ పరిస్థితులపై చర్చించనున్న అమిత్ షా లోక్ సభ ఎన్నికలపై పార్టీ నేతలకు దిశానిర్దేశం చేయనున్నారు.
ఈ మేరకు లోక్ సభ ఎన్నికల్లో డబుల్ డిజిట్ స్థానాలు గెలిచే విధంగా కష్టపడాలని పార్టీ శ్రేణులకు సూచించనున్నారని తెలుస్తోంది.సమావేశం ముగిసిన అనంతరం మధ్యాహ్నం 3.05 గంటలకు చార్మినార్ భాగ్యలక్ష్మీ అమ్మవారి ఆలయానికి అమిత్ షా వెళ్లనున్నారు.అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించిన అనంతరం లోక్ సభ ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుట్టనున్నారు.అక్కడ నుంచి 3.50 గంటలకు రంగారెడ్డి జిల్లాలోని కొంగరకలాన్ శ్లోక కన్వెన్షన్ కు చేరుకోనున్నారు.అక్కడ అమిత్ షా బీజేపీ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించనున్నారు.







