కాంగ్రెస్ లో ఊహించని మార్పులు ...అసలు కారణమిదేనా

తెలంగాణ కాంగ్రెస్ రోజు రోజుకు బలోపేతం కావడానికి ప్రయత్నిస్తున్న పరిస్థితి ఉంది.

ఇంకా సార్వత్రిక ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో వచ్చే ఎన్నికల్లో గతంలో కంటే మెరుగైన ఫలితాలు రావాలనే ఉద్దేశ్యంతో రేవంత్ చాలా దూకుడుగా ముందుకు సాగుతున్న పరిస్థితి ఉంది.

అయితే నేటి నుండి అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మల్లు భట్టి విక్రమార్క అధ్యక్షతన సీఎల్పీ సమావేశం జరిగిన విషయం తెలిసిందే.అయితే ఈ సమావేశానికి కాంగ్రెస్ సీనియర్ లు జగ్గారెడ్డి, ఉత్తమ్ కుమార్ రెడ్డి లాంటి నేతలు హాజరుకావడం ఒక్కసారిగా రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది.

అయితే ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం.ఎందుకంటే ఇంకా ఎన్నికలకు రెండున్నర సంవత్సరాలు మాత్రమే ఉండటంతో  చాలా జాగ్రత్తగా అడుగులు వేస్తున్న పరిస్థితి ఉంది.

అయితే రానున్న రోజుల్లో కాంగ్రెస్ కాస్త పుంజు కుంటే ఎంతో కొంత కీలక పాత్ర పోషించే అవకాశం ఉంటుంది.ఒక్కసారిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడానికి కలిసికట్టుగా పోరాడుతున్నారు అనే సంకేతం ప్రజల్లోకి వెళ్తే కాంగ్రెస్ బీజేపీని వెనక్కినెట్టే అవకాశం ఉంటుంది.

Advertisement

అయితే తాజాగా జరిపిన సర్వేలో కూడా వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ కీలక పాత్ర పోషిస్తుందని ఎక్కువ సీట్లు గెలిచే అవకాశం ఉందనే సర్వేలలో కూడా స్పష్టమైన నేపథ్యంలో ఇంకాస్త కాంగ్రెస్ ఎక్కువగా దృష్టి  పెడుతున్న పరిస్థితి ఉంది.అయితే అధిష్టానం కూడా ఇప్పటికే సమస్యలు సృష్టిస్తున్న నేతలతో ఇప్పటికే హెచ్చరికలు అదే విధంగా మందలించినట్లు కూడా వార్తలు వస్తున్నాయి.

అందుకే సీఎల్పీ సమావేశంలో చాలా మంది సీనియర్ నేతలు హాజరవడంతో కాంగ్రెస్ ఇప్పుడు రాష్ట్ర రాజకీయాల్లో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్ గా మారింది.మరి రానున్న రోజుల్లో ఎటువంటి పరిణామాలు చోటు చేసుకుంటాయనేది చూడాల్సి ఉంది.

Advertisement

తాజా వార్తలు