గత కొన్ని సంవత్సరాలుగా ప్రపంచవ్యాప్తంగా కృత్రిమ మేధా లేదా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్( Artificial Intelligence ) తన దుష్పరిణామాలను చూపించడం మొదలైంది.ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ పెరిగే కొద్దీ ఉద్యోగితా శాతం పడిపోతుందని ,మానవ వనరులకు ఇది అతి పెద్ద ముప్పుగా వాటిల్లే అవకాశం ఉందని టెక్నాలజీ నిపుణులు వ్యక్తం చేస్తున్న అనుమానాలు నిజమయ్యే పరిణామాలు ఒక్కొక్కటిగా చోటు చేసుకుంటున్నాయి.
ఇప్పుడు బెంగళూరులో( Bangalore ) ఒక స్టార్టప్ కంపెనీ 90% ఉద్యోగులను తొలగించి వాటిని చాట్ జి పి టి బోట్ లతో నింపేసిన వైనం తీవ్ర చర్చనీయాంశంగా మారింది.

బెంగళూరు కేంద్రంగా సేవలందించే దుకాణ్ అనే సంస్థ( Dukan ) తమ కస్టమర్ కేర్ విభాగంలోని 90% ఉద్యోగాలను చాట్ బోట్ లతో భర్తీ చేసింది.దీనివల్ల సమయం ఆదా అవడంతో పాటు సంస్థకు 85% ఖర్చు కూడా ఆదా అయ్యిందని అని కంపెనీ చెబుతుంది .ఇప్పుడు కస్టమర్లకు సేవలు అందించే సమయం రెండు గంటల నుంచి మూడు నిమిషాలకు తగ్గిందని, అత్యంత వేగవంతమైన సర్వీస్ను అత్యంత తక్కువ సమయంలో, తక్కువ ఖర్చుతో చేయగలుగుతున్నామని, ఆర్థికంగా కూడా చాలా ఆదా చేసుకుంటున్నామని కంపెనీ చెబుతుంది.

అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వాడకం పెరిగే కొద్దీ అది మానవ వనరుల అవసరం తగ్గిస్తుందని, ఇది దేశ ఆర్థిక వ్యవస్థకు( country’s economy ) మంచిది కాదని నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు .ఇదే పరిస్థితి కొనసాగితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వల్ల నిరుద్యోగత శాతం తీవ్రంగా పెరిగే అవకాశం కనిపిస్తుంది .ఇప్పటికే సాఫ్ట్వేర్ రిలేటెడ్ సర్వీసెస్( Software related services ) లోనూ టెక్నాలజీ రిలేటెడ్ సంస్థలలోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ల వాడకం పెరిగింది .ఇప్పుడు అనేక సంస్థలు తమ వ్యాపార సేవలను కృత్రిమ మేధ తో భర్తీ చేసే ప్రయత్నాలు మొదలుపెట్టాయి .పరిస్థితి ఇలాగే కొనసాగితే మాత్రం అది తీవ్ర భయంకరమైన నిరుద్యోగిత కి దారితీసే అవకాశాలు కనిపిస్తున్నాయి .మరి ప్రభుత్వం దేనిపై స్పష్టమైన నియంత్రణ విధించకపోతే మాత్రం దీన్ని దాటికి మరిన్ని తీవ్ర పరిణామాలు చూడవలసిన పరిస్థితి రావచ్చు .







