చైనా దెబ్బకు అమెరికా విలవిల.. ఏమైందంటే..?

చైనా, అమెరికా మధ్య ఎప్పుడూ ఏదోక విషయంలో వార్ జరుగుతూ ఉంటుది.ఆర్ధికపరంగా రెండు దేశాలు ఒకదానిపై ఒకటి ఆధిపత్యం సాధించేందుకు ప్రయత్నాలు చేస్తూ ఉంటారు.

 The War Going On Between The Two China And America Over Semiconductor Chips , Am-TeluguStop.com

దీంతో రెండు దేశాల మధ్య వివాదాలు జరుగుతూ ఉంటాయి.అయితే ఇప్పుడు సెమీ కండక్టర్ చిప్( semi Conductor Chip ) ల గురించి రెండు దేశాల మధ్య పోటీ నెలకొంది.

కంప్యూటర్లు, ల్యాప్ టాప్ లు, బైక్ లు, కార్ల తయారీలో సెమీ కండక్టర్ చిప్ లను ఉపయోగిస్తారు.మొన్నటివరకు సెమీ కండక్టర్ల చిప్ ల ఉత్పత్తిలో చైనా అగ్రస్థానంలో ఉంది.

Telugu America, Cars, China, International, Latest, Semi Conductors, Xi-Telugu N

అయితే కరోనా తర్వాత పరిస్థితులు ఒక్కసారిగా మారిపోయాయి.సెమీ కండక్టర్ చిప్ ల తయారీ చైనాలో భారీగా తగ్గింది.దీంతో చైనా ( China )కూడా ఇతర దేశాలకు ఎగుమతులను తగ్గించింది.దాని ప్రభావం చాలా దేశాలపై పడుతుంది.దీని వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులు, కార్ల తయారీ తగ్గిపోయింది.అయితే అమెరికాలో చిప్స్ డిజైన్ చేస్తే చైనాలో అసెంబ్లింగ్ జరుగుతుంది.

అయితే కరోనా తర్వాత మిషన్లను చైనాకు పంపకుండా అమెరికా నిలిపివేసింది.దీంతో అమెరికాకు మెటీరియల్స్ పంపకుండా చైనా నిషేధం అమల్లోకి తెచ్చింది.

Telugu America, Cars, China, International, Latest, Semi Conductors, Xi-Telugu N

రెండు దేశాల మధ్య సెమీ కండక్టర్ చిప్ ల విషయంలో జరుగుతున్న వార్ తారాస్థాయికి చేరుకుంది.దీని వల్ల అమెరికాకు తీవ్ర నష్టం జరుగుతుంది.అమెరికాలోని కార్ల తయారీ సంస్థలను సెమీ కండక్టర్ చిప్ ల కొరత వెంటాడుతుంది.దీంతో అక్కడ చాలా కంపెనీలు నష్టపోతున్నాయి.దీంతో చైనాతో చర్చలు జరిపేందుకకు అమెరికా ప్రయత్నాలు చేస్తున్నాయి.కానీ చైనా మాత్రం దిగి రావడం లేదు.

రెండు దేశాల మధ్య గత కొద్దిరోజులుగా దీని గురించే చర్చలు జరుగుతున్నాయి.ఇవి కొలిక్కి వస్తాయో.

లేదో చూడాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube