సిగరెట్‌ను మురుగు కాలువలోకి విసిరిన యువకుడు.. ఒకేసారి పేలడంతో తీవ్ర గాయాలు...

ఒక్కోసారి మనకు తెలియకుండా చేసే కొన్ని పనులు ప్రాణాలకి హాని కలిగిస్తాయి.అవే చివరికి పెద్ద గుణపాఠం అవుతాయి తాజాగా ఇలాంటి ఏం షాకింగ్ ఎక్స్‌పీరియన్స్ ఒక యువకుడికి ఎదురయింది.

 Underground Sewer Explodes In After Man Threw Lit Cigarette Details, Viral Video-TeluguStop.com

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.దీనిని ట్విట్టర్ పేజీ @cctvidiots షేర్ చేయగా దీనికి ఇప్పటికే 75 లక్షలకు పైగా వ్యూస్ వచ్చాయి.

ఈ వీడియో ప్రకారం, కాల్చేశాక మిగిలిపోయిన సిగరెట్‌ను( Cigarette ) మురుగు కాలువలోకి విసరడం ఒక యువకుడి పాలిట శాపమయింది.ఆ అజాగ్రత్త చర్య వల్ల పేలుడు సంభవించి( Blast ) అతడు బాగా గాయపడ్డాడు.

మురుగునీటి వ్యవస్థ పరిధిలో పేరుకుపోయిన సేంద్రీయ పదార్థం కుళ్ళిపోవడం వల్ల మండే ఉప ఉత్పత్తి అయిన మీథేన్ వాయువు తయారైంది.ఆ వాయువుకి నిప్పు( Fire ) అంటగానే అది ఒక్కసారిగా మండిపోయింది.

ఈ ఆకస్మిక దహన వాయువు వేగవంతమైన విస్తరణకు కారణమై విపరీతమైన ఒత్తిడిని సృష్టించింది, ఇది భారీ శబ్దంతో మురుగునీటి గ్రేట్ పగిలిపోయేలా చేసింది.

ఫలితంగా ఏర్పడిన షాక్‌వేవ్ శిధిలాలు అన్ని దిశలలో ఎగురుతూ, వినాశనాన్ని సృష్టించాయి.ఈ పేలుడులో ఆ స్మోకర్( Smoker ) తీవ్రంగా గాయపడ్డాడు.అతడు ఎగిరి కింద పడ్డాడు.

పైకి లేవడానికి చాలా కష్టపడ్డాడు.అతడు బూట్లు కూడా ఊడిపోయాయి.

నేలపై పాకుతూ కనిపించాడు శరీరానికి మొత్తం మట్టి అంటుకుపోయింది.ఈ దృశ్యాన్ని గమనించిన స్థానికుడు ఒకరు అతడిని లేపడానికి, సహాయం చేయడానికి ప్రయత్నించారు.ఈ వీడియో చూసిన చాలామంది షాక్ అవుతున్నారు వామ్మో ప్రమాదాలు ఈ విధంగా కూడా వస్తాయా అని చాలామంది నోరెళ్ళబెడుతున్నారు.ఈ వీడియో పై మీరు కూడా ఒక లుక్ చేయండి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube