కేంద్ర హోం మంత్రి అమిత్ షా తో జూనియర్ ఎన్టీఆర్ భేటీ కావడం రెండు తెలుగు రాష్ట్ర రాజకీయాల్లో సంచలనం రేపుతోంది.బీజేపీకి చెందిన కీలక అగ్రనేత కావటంతో.
హఠాత్తుగా ఎన్టీఆర్ తో భేటీ కావడం రకరకాల ఊహాగానాలకు తెర లేపుతూ ఉంది.మరోపక్క వీరిద్దరి సమావేశానికి ఎటువంటి రాజకీయ ప్రాధాన్యత లేదని భారతీయ జనతా పార్టీ నేతలు వ్యాఖ్యానిస్తున్నారు.
ఇటువంటి తరుణంలో మాజీ పార్లమెంట్ సభ్యుడు ఉండవల్లి అరుణ్ కుమార్ వీరిద్దరి భేటీ పై రియాక్ట్ అయ్యారు.అమిత్ షా తో ఎన్టీఆర్ భేటీ రాజకీయమే అయ్యుండొచ్చని పేర్కొన్నారు.
ఒక తెలంగాణలో మాత్రమే కాదు రెండు తెలుగు రాష్ట్రాలలో ఎన్టీఆర్ సేవలు వినియోగించుకునే దిశగా బిజెపి వ్యూహం వేసి ఉండొచ్చాని చెప్పుకొచ్చారు.ఎన్టీఆర్ కి ఖచ్చితంగా రాజకీయాలపై అవగాహన ఉందని ఉండవల్లి తనదైన శైలిలో వ్యాఖ్యానించారు.
ఏది ఏమైనా 2009 నుండి టిడిపికి రాజకీయాలకు దూరంగా ఉంటున్న జూనియర్ ఎన్టీఆర్ ఒక్కసారిగా బీజేపీ అగ్రనేత అమిత్ షాతో భేటీ కావడం అనేక సంచలనాలకు తెరలేపింది.







