ఇప్పుడు ఉండవల్లి శ్రీదేవి( Undavalli Sridevi ) వ్యవహారం రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది.వైసిపి ( YCP ) విమర్శలకు తిరిగి సమాధానం చెప్పే విషయంలో ఆమె చూపిస్తున్న తెగువ , ధైర్యం వైసిపి పార్టీలోని బలహీనతల్ని ఎండగడుతున్న తీరు వైసిపి ఇమేజ్ను భారీగా డామేజ్ చేస్తుందన్న విమర్శలు వినిపిస్తున్నాయి.
సాక్ష్యం లేని విషయాల్లో కేవలం అభిప్రాయాలు ఆధారంగానే తనను సస్పెండ్ చేశారని ,మరి పార్టీ పరువు తీసే విధంగా సాక్షాలతో సహా దొరికిన కొంతమంది నేతల మీద ఏమాత్రం చర్యలు తీసుకున్నారు అంటూ ఆమె నిలదీసిన తీరు వైసీపీ నేతలను కార్నర్ చేసింది.అంతకుముందు స్త్రీల విషయంలో అనుచిత వ్యాఖ్యలు చేసిన అంబటి రాంబాబు( Ambati Rambabu ) విషయం లో గాని అవంతి విషయంలో గానీ ,అతి జుగుప్సాకరంగా వీడియోలతో సహా దొరికిన గోరంట్ల మాధవ్ విషయంలో గాని పార్టీ ఎందుకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆమె సూటిగా ప్రశ్నిస్తున్న తీరు వైసిపి నేతలకు తిరిగి సమాధానం చెప్పలేని పరిస్థితిని సృష్టించింది .

డబ్బే ప్రయారిటీ అనుకుంటే గనక తాను బిజీ డాక్టర్ ని అని ఐ వి ఎఫ్ నిపుణురాలునని, తన భర్త శ్రీధర్ రోబోటిక్ సర్జన్ అని తాము తమ వృత్తులలో కొనసాగితే ఇంతకు మించిన డబ్బు సంపాదించి ఉండే వాళ్ళమని ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి అనవసరంగా మాటలు పడుతున్నామంటూ ఆమె వాపోయారు .వీడియోలో ఆమె మాటలు వింటున్న వారికి ఇది ఆమె మాటలు సూటిగా తగులుతున్నాయి.డాక్టర్లుగా తమకు సమాజంలో ఉన్న హోదా, తమ కమ్యూనిటీకి ఉన్న ఓటు బ్యాంకు ని చూసుకొని సీటు ఇచ్చారని .ఆ కృతజ్ఞత తాను చివరి వరకు నిలబెట్టుకున్నానని కరోనా లాంటి క్లిష్టమైన సమయాల్లో కూడా పార్టీ కోసం ప్రజల్లో ప్రచారం చేశానని,

కరోనాకు గురై వెంటిలేటర్ వరకూ వెళ్లే పరిస్థితి వచ్చినా కూడా పార్టీ కోసం తాను అహర్నిశలు కష్టపడ్డానని , ఆ కష్టానికి తనకిచ్చిన రిటర్న్ గిఫ్ట్ చూస్తే చాలా ఆనందంగా ఉందంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.ఏది ఏమైనా ఇంతవరకు ప్రతిపక్షాల విమర్శలు తప్ప ఎమ్మెల్యేల పరంగా ఒక తిరుగుబాటు కూడా లేని వైసిపి ప్రభుత్వానికి ఇప్పుడు సస్పెండ్ చేసిన ఎమ్మెల్యేలు చేస్తున్న విమర్శలు గుక్క తిప్పుకోకుండా చేస్తున్నాయి పాయింట్ టు పాయింట్ కార్నర్ చేసి మరి వారు రిలీజ్ చేస్తున్న వీడియోలు ప్రజల్లో ప్రభుత్వాన్ని పలుచన చేసే విధంగా ఉన్నాయని వైసీపీ ప్రభుత్వం దిద్దుబాటు చర్యలు తీసుకోకపోతే పరిస్థితి ఇంకా చేయి జారిపోతుంది అన్న వార్తలు వస్తున్నాయి
.