ఇప్పటికే అధికార ప్రతిపక్ష వ్యూహ ప్రతివ్యూహాలతో సస్పెన్స్ థ్రిల్లర్లా తయారైన రాష్ట్ర రాజకీయాల్లో తన సడన్ ఎంట్రీ తో మరింత నాటకీయతను ఉండవల్లి జోడించారనే చెప్పవచ్చు.స్కిల్ డెవలప్మెంట్ కేసులో రిమాండ్ ను క్యాన్సిల్ చేయాలని హైకోర్టును ఆశ్రయించిన బాబు( Chandrababu arrest ) బృందానికి చుక్కెదురైంది.
హైకోర్టులో దాఖలైన క్వాష్ పిటిషన్ ను హైకోర్టు తిరస్కరించింది .దాంతో తెలుగుదేశానికి అతిపెద్ద దెబ్బ తగిలినట్లు అయింది.మరోపక్క పులి మీద పుట్రలా సిబిఐ కోర్టులో చంద్రబాబు కస్టడీ కోసం సిఐడి వేసిన పిటిషన్ ను కోర్టు అంగీకరించింది.దాంతో జ్యూడిషియల్ రిమాండ్ నుంచి సిఐడి కస్టడీ కి చంద్ర బాబు బాబు ట్రాన్స్ఫర్ అవుతారని తెలుస్తుంది.
అయితే ఊహించని పరిణామంలా ఏపీ హైకోర్టులో మరో పిటిషన్ దాఖలు అయింది .మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్( Vundavalli Aruna Kumar ) ఈ ప్రజా ప్రయోజన వ్యాజ్యాన్ని హైకోర్టులో వేశారు.

స్కిల్ డెవలప్మెంట్ కేసు( Skill development ) మూడు నాలుగు రాష్ట్రాలతో ముడిపడి ఉన్నందున ప్రజాప్రయోజనాలు దెబ్బతినే అవకాశం ఉందని దీనిని అతి పెద్ద విచారణ సంస్థ అయిన సిబిఐ తో విచారణ జరిపిస్తే మరిన్ని సంచలనాత్మక విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉందంటూ ఆయన హైకోర్టులో ఫీల్ దాఖలు చేశారు ఉండవల్లి.దీనిని హైకోర్టు విచారణకు స్వీకరించింది.అయితే ఉండవల్లి చర్య రాష్ట్రంలో మెజారిటీ జనానికి షాక్ ఇచ్చిందని చెప్పవచ్చు.

అసలు ఉండవల్లి ఏ పార్టీకి అనుకూలంగా ఈ పిటిషన్ వేశారు అన్నదానికి ఎవరికి వారు తమదైన భాష్యం చెప్పుకుంటున్నారు.చంద్రబాబుకు షాక్ ఇవ్వడానికే ఉండవల్లి ఈ విధంగా పిటిషన్ వేశాడని వైసిపి( YCP ) అనుకూల వర్గాలు వాదిస్తుంటే.సిఐడి విచారణ మీద విశ్వసనీయత లేకే ఉండవల్లి కేంద్ర అధీనంలో ఉన్న సిబిఐ ను ఆశ్రయించాడని తద్వారా బాబు బృందానికి రిలీఫ్ దొరికే అవకాశం ఉందంటూ తెలుగుదేశం అనుకూల మీడియా చెబుతుంది.
ఏది ఏమైనా తన సడన్ ఎంట్రీ తో ఒకసారిగా రాష్ట్రవ్యాప్తంగా ఉండవల్లి చర్చనీయాంశం గా మారారని చెప్పవచ్చు
.