కొడుకు చేసిన అప్పు తీర్చలేక.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

చిత్తూరు జిల్లా పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలోని రాచపాలెం గ్రామంలో విషాదం చోటుచేసుకుంది. కుటుంబంలో ఒక వ్యక్తి చేసిన అప్పులు తీర్చలేక ఉరి వదిలి వెళ్ళిపోగా అప్పులు ఇచ్చిన వారు ఆ వ్యక్తి ఇంటికి వెళ్లి అతని కుటుంబ సభ్యులను అసభ్య పదజాలంతో దూషించారని, శాపనార్థాలు పెట్టారని దీంతో ఆ అవమానం భరించలేక ఒకే కుటుంబంలో ముగ్గురు పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నారు.

 Unable To Repay Son's Debt .. Three Committed Suicide In The Same Family, Suicid-TeluguStop.com

వివరాల్లోకి వెళితే చిత్తూరు జిల్లాలోని పుత్తూరు మున్సిపాలిటీ పరిధిలో రాచపాలెం చెందిన శంకరయ్య పెద్ద కుమారుడు సతీష్ (35) అప్పులు చేసి తీర్చలేక ఉరి వదిలి వారం క్రితం పరారయ్యాడు.

ఈ విషయం తల్లిదండ్రులు సోదరుడు కి గానీ తెలియదు.

ఈ విషయం తెలుసుకున్న డబ్బులు ఇచ్చినవారు సతీష్ ఇంటికి వెళ్లి తమ వద్ద తీసుకున్న అప్పులు తీర్చాలి అని గొడవకు దిగినట్లు సమాచారం.అంతేకాకుండా అసభ్య పదజాలంతో సతీష్ కుటుంబ సభ్యులను తో పాటు తన కుమారుడు చేసిన అప్పు తీర్చలేక, అవమానం భరించలేక  తండ్రి శంకరయ్య, తల్లి గురమ్మ, తమ్ముడు వినయ్ పురుగుల మందు తాగారు.

విషయం తెలుసుకున్న స్థానికులు ఆటోలో పుత్తూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు.ఒకే కుటుంబంలో ముగ్గురు చనిపోవడంతో రాచపాలెం గ్రామంలో విషాద ఛాయలు నెలకొన్నాయి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube