జనసేన అధినేత పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న వారాహి యాత్ర అట్టర్ ఫ్లాప్ అని మంత్రి కొట్టు సత్యనారాయణ అన్నారు.కాకినాడలో ద్వారంపూడి సవాల్ ను స్వీకరించలేక పవన్ తోకముడిచారన్నారు.
ముద్రగడపై పవన్ వ్యాఖ్యలు కాపుల మనోభావాలను దెబ్బతీశాయని తెలిపారు.కాపులపై ప్రేమను కురిపిస్తున్న పవన్ ముద్రగడ కుటుంబంపై దాడి జరిగితే ఎందుకు స్పందించలేదని ప్రశ్నించారు.
చంద్రబాబు ఏం చెప్పమంటే పవన్ అదే చెప్తున్నారని ఆరోపించారు.కాపులకు తీవ్ర అన్యాయం చేసిన చంద్రబాబుతో పవన్ కలిశారని విమర్శించారు.
ఈ క్రమంలో కాపులను చీల్చేందుకు చంద్రబాబు యత్నిస్తున్నారా అని నిలదీశారు.







