ప్రతిసారి ఎన్నో సరికొత్త కొత్త అంశాల ద్వారా సినిమాలు ప్రేక్షకుల ముందుకు వస్తూ ఉంటాయి అయితే విలేజ్ బ్యాక్ డ్రాప్ లో కూడా ఇప్పటివరకు ఎన్నో సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.ఈ విధంగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లో వచ్చే సినిమాలను ప్రేక్షకులు ఎప్పుడు ఆదరిస్తూనే ఉంటారు.
తాజాగా ఇలాంటి జానర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చినటువంటి చిత్రం ఉమాపతి( Umapathi ) .సత్య ద్వారంపూడి దర్శకత్వంలో .క్రిషి క్రియేషన్స్ బ్యానర్ లో కే కోటేశ్వర రావు నిర్మాణంలో అనురాగ్( Anurag ) అవికా గోర్ ( Avika Gor ) హీరో హీరోయిన్లు నటించిన ఈ సినిమా నేడు డిసెంబర్ 29వ తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చింది మరి ఈ సినిమా కథ ఏంటి సినిమా ప్రేక్షకులను ఎలా ఆకట్టుకుంది అనే విషయానికి వస్తే.
కథ:
ఉమాపతి కథ దోసకాయలపల్లి, కొత్తపల్లి మధ్య జరుగుతుంది. వర (అనురాగ్) కొత్తపల్లికి చెందిన వ్యక్తి.ఈయన ఎలాంటి పని పాట లేకుండా అల్లరి చిల్లరగా తిరుగుతూ ఉంటారు కానీ వర తండ్రి మాత్రం దుబాయ్ లో కష్టపడి పని చేస్తూ డబ్బులను పంపిస్తూ ఉండగా ఆ డబ్బుతో వర ఎంజాయ్ చేస్తూ ఉంటారు.
పక్క ఊరైన దోసకాయపల్లిలో ఉమా (అవికా గోర్)( Avika Gor )ను ఇష్టపడుతుంటాడు.కానీ ఆ ఊరికి ఈ ఊరికి పచ్చగడ్డి వేస్తే భగ్గుమనేలా వైరం ఉంటుంది.
ఉమా సోదరుడికి పాత గొడవలు ఉంటాయి.ఇలాంటి తరుణంలోవర తన ప్రేమను ఉమాకు తెలియజేస్తాడు వీరిద్దరూ తమ ప్రేమను ఎలా గెలిపించుకుంటారు అసలు ఈ రెండు ఊర్ల మధ్య ఉన్నటువంటి పాత గొడవలు ఏంటి అనేది ఈ సినిమా కథ.
నటీనటుల నటులు :
ఈ సినిమా మొత్తం అనురాగ్ అవికా గోర్ మధ్యనే కొనసాగుతుంది.యాక్షన్, కామెడీ, రొమాన్స్ ఇలా అన్ని ఎమోషన్స్‌ను చూపిస్తూ అనురాగ్ ఎంతో అద్భుతంగా నటించారు.ఇక అవికా గోర్ కూడా అద్భుతమైనటువంటి నటి అనే విషయం మనకు తెలిసిందే.ఇలా ఈ సినిమాలో ఎవరి పాత్రలకు వారందరూ కూడా పూర్తిగా న్యాయం చేశారు.
టెక్నికల్
: విలేజ్ బ్యాక్ ప్రాబ్లం దర్శకుడు ఎంతో అద్భుతంగా ఈ సినిమాని ప్రేక్షకుల ముందుకు తీసుకువచ్చారు.ఇక ఈ సినిమాకు మ్యూజిక్ హైలెట్ అని చెప్పాలి.
ఎడిటింగ్ ఎంతో అద్భుతంగా ఉంది.డైలాగ్స్ ఎంతో అద్భుతంగా ఆకట్టుకున్నాయి.
నిర్మాణాత్మక విలువలు కూడా అద్భుతంగా ఉన్నాయి.నిర్మాత ఎక్కడ కాంప్రమైజ్ కాలేదని చెప్పాలి.
విశ్లేషణ:
ఈ సినిమా పూర్తిగా విలేజ్ బ్యాక్ డ్రాప్ లోనే ప్రేక్షకుల ముందుకు వచ్చింది.ఇలాంటి తరహా సినిమాలు ఇదివరకు ఎన్నో వచ్చాయి కానీ ఈ సినిమా ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని కలిగించింది.ఊరి వాతావరణం, గొడవలు, జోకులు ఇలా అన్నింటిని మిక్స్ చేసి ఫస్ట్ హాఫ్ లో చక్కని వినోదాన్ని చూపించారు.ఇంటర్ వెల్ కి ముందు ట్విస్ట్ ఇచ్చారు.
ఆ ట్విస్ట్ ఏంటి అనేది సెకండ్ హాఫ్ లో బయటపడుతుంది.మొత్తానికి ఈ సినిమా ద్వారా డైరెక్టర్ ప్రేక్షకులకు సరికొత్త అనుభూతిని అందించారు.
ప్లస్ పాయింట్స్:
సినిమాలు ఎమోషనల్ సన్నివేశాలు, మ్యూజిక్, నటీనటుల నటన.
మైనస్ పాయింట్స్: అక్కడక్కడ కొన్ని సన్నివేశాలు చూసిన అనుభూతి, కొన్ని సన్నివేశాలను సాగదీయడం.
బాటమ్ లైన్:
ఇలాంటి జానర్ లో ఎన్ని సినిమాల్లో వచ్చిన ఈ సినిమా మాత్రం ప్రేక్షకులకు కొత్త అనుభూతి ఇచ్చింది.ఏమాత్రం బోర్ కొట్టకుండా ఒకసారి ఈ సినిమాని చూడవచ్చు.