ప్రేమకు కళ్లుండవు అంటారు! కానీ, వీరు ప్రేమించుకున్నారు ఓకే తమ ప్రేమకు ఓ పరీక్ష పెడుదామని అనుకున్నారు.నిజానికి ఇది ఒక విచిత్రమైన ప్రేమకథ ఇది.
లైలామజ్నుల్లా చరిత్రలో నిలిచిపోదమని అనుకున్నారో.లేదా గిన్నీస్ బుక్‌లో స్థానం సంపాదించాలనుకున్నారో కానీ, దాదాపు 123 రోజుల పాటు వీరి చేసిన పని వింతగా అనిపిస్తుంది.
అదేంటంటే అన్ని రోజుల పాటు వారు ఒకరినొకరు సంకెళ్లతో చేతులు కట్టేసుకున్నారు.అబ్బా ఎంత ఘాటు ప్రేమయో! అనుకోవచ్చు.కానీ, తీరా అదే వారి కొంపముంచింది.సా«ధారణంగా ఒకరోజంతా ఒకరి మొహం ఒకరు చూసుకుంటూ ఉంటేనే బోర్ కొట్టే ప్రస్తుత ప్రపంచంలో వీరు ఏకంగా 123 రోజుల పాటు అరెస్టు చేసుకున్నారంటే ఏమనాలి? ఎందుకంటే ప్రస్తుతం వారు విడిపోయారు.

ఎవరి దారి వారు చూసుకున్నారు.ఇది ఉక్రెయిన్‌లో జరిగింది.అలెగ్జాండర్ కుడ్లే, విక్టోరియా అనే ఈ ప్రేమికులు తమ బంధం ఎంత బలమైందో అని పరీక్షించుకోవాలనుకున్నారట.అందుకే ఇప్పటి వరకు చరిత్రలో కని, విని ,ఎరగని నిర్ణయం తీసుకున్నారు.
ఇద్దరి చేతులకు కలిపి సంకెళ్లు వేయించుకున్నారు.దీని ద్వారా ఏవైనా మనస్పర్థలు ఉంటే తొలగించుకోవచ్చు అనుకున్నారు.
అంటే వీరి ప్రధాన ఉద్దేశం చేతికి సంకెళ్లు ఉంటే ఒకరినొకరు సాయం చేసుకుంటూ జీవితంలో కూడా ముందుకు వెళ్లడానికి ఉపయోగపడుతుంది అనుకున్నారు.మొదట్లో ఏదైనా బానే ఉంటుంది కదా! అలాగే కలిసి వంట చేసుకున్నారు, బట్టలు ఉతుకున్నారు, కలిసి భోజనం వైగరా కూడా చేశారు.
కానీ, ఎన్నిరోజుల అలా చేసుకుంటూ పోతారు.టైం గడుస్తున్నా కొద్దీ.
బోర్ కొట్టేసింది.ఏమైందో ఏమో? కానీ, సంకెళ్లు వేసినయి వేసినట్టుగానే ఉన్నాయి కానీ, వారి ప్రేమ ముందటిలా లేదు! వారిరువురూ కలిసి జీవించటం కష్టతరం అనిపించింది.చివరకు ఆ సంకెళ్లు వేసినవారిని పిలిచి, విడిపించుకున్నారు.సంకెళ్ల రాపిడితో విక్టోరియాకు చేతిపై అలర్జీ అయ్యింది.వైద్యుల వద్ద ఆమె చికిత్స తీసుకున్నారు.మొత్తానికి 123 రోజుల ఇలా సంకెళ్లతో కట్టేసుకొని ఓ అరుదైన రికార్డు వారి సొంతం చేసుకున్నారు.
విడిపోయిన వీరిద్దరూ ఇకపై తాము వేరువేరుగా లైఫ్‌ను ఎంజాయ్ చేస్తామని చెప్పారు.ఎక్కడైతే వారు తమని బంధించకున్నారో అక్కడే వారికి విముక్తి కలిగింది.