ఉద్యోగాలకు విసిగిపోయి సైడ్ బిజినెస్ పెట్టాడు.. ఇప్పుడు నెలకు రూ.1 కోటి సంపాదన..

చాలా మంది ఉద్యోగులు ఏదో ఒక సమయంలో జాబ్ కోల్పోక తప్పదు.ఈ సవాలును తరచుగా ఎదుర్కొంటూ ఉంటుంటే చాలా కష్టమని చెప్పవచ్చు.

 Uk Man Ryan Mcateer Kept Getting Fired From Jobs Now Makes Huge Profits From Bus-TeluguStop.com

అయితే కొంతమంది ఈ ఛాలెంజ్‌ని అధిగమించి విజయం సాధిస్తారు.ఆ వ్యక్తులలో ఒకరు ఇంగ్లాండ్‌లోని( England ) లివర్‌పూల్‌లో నివసిస్తున్న ర్యాన్ మెకాటీర్.

( Ryan Mcateer ) అతని వయస్సు 25 సంవత్సరాలు, అతనికి కార్లంటే చాలా ఇష్టం.కానీ అతనికి ఒక సమస్య తరచూ ఎదురయ్యేది, అతను ఎక్కువ కాలం ఉద్యోగం ఉంచుకోలేకపోయేవాడు.

ఎప్పుడూ ఆలస్యంగా వస్తున్నాడని లేదా పనికి డుమ్మా కొడుతున్నాడని కంపెనీలు అతడిని తొలగిస్తూ ఉండేవి.

దాంతో ర్యాన్ మెకాటీర్ సైడ్ ప్రాజెక్ట్‌గా తన సొంత కార్ల వ్యాపారం( Car Business ) ప్రారంభించాలని నిర్ణయించుకున్నాడు.అదే బిజినెస్ నుంచి అతను ఇప్పుడు ప్రతి నెలా 100,000 పౌండ్లు (సుమారు రూ.1 కోటి 5 లక్షలు) సంపాదిస్తున్నట్లు చెప్పాడు.

Telugu Car, Cars, Profits, Job Challenges, Jobs, Liverpool, Rock Car, Ryan Mcate

మిర్రర్ వార్తాపత్రిక అతని కథ గురించి రాసింది.ఆ కథనం ప్రకారం, అతను 19 ఏళ్ల వయస్సులో తన మొదటి కారును విక్రయించాడు.కానీ ఓ పెద్ద కార్ల కంపెనీలో( Car Companies ) పనిచేసినప్పుడు మాత్రం రాణించలేదు.చాలా కార్ల డీలర్‌షిప్‌లు ఉపయోగించిన కార్లను రుణాలతో కొనుగోలు చేసి వాటిని ఎక్కువ కాలం షెడ్‌లోనే ఉంచుకుంటాయని, వాటిని త్వరగా విక్రయించకలేక నష్టపోతున్నాయని అతను చెబుతున్నాడు.

Telugu Car, Cars, Profits, Job Challenges, Jobs, Liverpool, Rock Car, Ryan Mcate

ఈ ప్రదేశాలలో పని చేయడం ద్వారా ర్యాన్ కొన్ని మెలకువలు నేర్చుకున్నాడు.కారుని పొందే ముందు కస్టమర్‌ని పొందాలనే ఆలోచన చేశాడు.పెద్ద కంపెనీలో చేరడానికి ముందు ఈ కుర్రోడు దాదాపు 15 కార్ సేల్స్ గ్యారేజీల్లో పనిచేశాడు.అప్పుడు కార్లను ఎలా అమ్మాలో బాగా అర్థం చేసుకున్నాడు.

ర్యాన్ కార్లను( Cars ) ఫాస్ట్ అమ్మడంలో నేర్పరి.కస్టమర్లు ఏం కోరుకుంటున్నారో, వారిని కారు కొనేలా ఎలా ఒప్పించాలో బాగా తెలుసుకున్నాడు.22 ఏళ్ల వయస్సులో రాక్‌స్టార్ కార్ ఫైనాన్స్( Rockstar Car Finance ) పేరుతో తన స్వంత వ్యాపారాన్ని ప్రారంభించాడు.కస్టమర్లను కనుగొనడానికి ఇన్‌స్టాగ్రామ్‌ను ఉపయోగించాడు.

ర్యాన్ తన వ్యాపారం ప్రారంభించినప్పుడు తన వద్ద డబ్బు లేదా డ్రైవింగ్ లైసెన్స్ లేదని చెప్పాడు.కానీ వెనక అడుగు వేయకుండా వ్యాపారం చేస్తూ ఇప్పుడు కోట్లు సంపాదిస్తున్నాడు.

25-year-old UK Man Ryan Mcateer Kept Getting Fired From Jobs Now Makes huge profits from business – News18 11 hours ago

News18 UK Man Kept Getting Fired Fro

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube