భర్తతో కలిసి బిగ్ బాస్ కి ఉదయభాను

తెలుగు బుల్లితెర ప్రేక్షకులు ఎప్పుడెప్పుడా అంటూ ఎదురు చూస్తున్న ఈ సంవత్సరం కొత్త సీజన్ బిగ్ బాస్ ( Big Boss )ఆగస్టు లేదా సెప్టెంబర్ నెలలో ప్రారంభం అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటూ స్టార్ మా వర్గాల ద్వారా సమాచారం అందుతుంది.

షో ప్రారంభానికి రెండు మూడు నెలల ముందు నుండే కంటెస్టెంట్స్ ఎంపిక జరుగుతుందనే విషయం తెలిసిందే.

అందులో భాగంగా షో నిర్వాహకులు ప్రస్తుతం కంటెస్టెంట్స్ ఎంపికలో ఉన్నారు.వంద మంది తో కూడిన జాబితాను మొదట తయారు చేసి అందులోంచి 30 మందిని తీసి చివరకు ఒక జాబితాను తయారు చేస్తారు.

విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం 100 మంది జాబితాలో ఇద్దరుగా ఉదయభాను మరియు ఆమె భర్త నిలిచారట.ఉదయభాను ఓకే చెబుతుందా లేదా అనే విషయం తెలియదు కానీ స్టార్ మా వర్గాల వారు మరియు షో నిర్వాహకులు ఉదయభాను దంపతులను( Udayabhanu coup ) బిగ్ బాస్ హౌస్ లోకి పంపించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లుగా వార్తలు వస్తున్నాయి.

ఈ విషయంలో నిజమెంత అనేది తెలియాల్సి ఉంది.గత రెండు మూడు సంవత్సరాలుగా ఉదయభాను బిగ్ బాస్ ఎంట్రీ ఇవ్వబోతుంది అనే ప్రచారం జరుగుతోంది.అయితే ఆమె పిల్లలు చిన్నవాళ్లు అవ్వడంతో వారిని విడిచిపెట్టి ఉదయభాను వెళ్లలేని పరిస్థితి.

Advertisement

ఇప్పుడు వారు పెద్ద పిల్లల అయ్యారు.వారి పనులు వారు చూసుకుంటూ తల్లికి స్వేచ్ఛను ఇచ్చారు.

ఈ మధ్య ఉదయభాను బుల్లి తెర మరియు వెండి తెర లపై కనిపించేందుకు ఆసక్తి చూపిస్తుంది.అందుకే బుల్లితెర మరియు వెండితెర పై బిజీ అవ్వాలి అంటే బిగ్ బాస్ లో ఉదయభాను ఇంటర్వ్యూ ఇవ్వాలని ఆమె అభిమానులు కూడా కోరుకుంటున్నారు.

ఈసారి ఉదయభాను ఎంట్రీ పక్కగా ఉంటుంది అని భావిస్తున్న తరుణం లో ఆమె భర్తని కూడా నిర్వాహకులు తీసుకు వచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు అంటూ వచ్చిన వార్తలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.ఈ వార్తల్లో నిజం ఎంత అనేది తెలియాలంటే ఉదయభాను లేదా బిగ్ బాస్ నిర్వాహకులు స్పందించాల్సి ఉంది.

మోహన్ బాబు ఫ్యామిలీ లో గొడవలు ఇప్పుడప్పుడే తగ్గేలా లేవా..?
Advertisement

తాజా వార్తలు