పెళ్లి మీద సంచలన కామెంట్స్ చేసిన నరేష్..?

అప్పట్లో చిరంజీవి, నాగార్జున, బాలకృష్ణ, వెంకటేష్ లాంటి హీరో లు స్టార్ హీరోలుగా కొనసాగుతుంటే రాజేంద్రసాద్, నరేష్( Naresh ) లాంటి వారు కామెడీ హీరోలుగా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.నటిగా డైరెక్టర్ గా గుర్తింపు పొందిన విజయ నిర్మల ( Vijaya Nirmala )కొడుకుగా ఇండస్ట్రీ కి ఎంట్రీ ఇచ్చిన నరేష్ జంబాలకిడి పంబ సినిమాతో హీరో గా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు.

 Naresh Made Sensational Comments On The Wedding, Naresh, Vijaya Nirmala, Malli P-TeluguStop.com

అలాగే జంధ్యాల డైరెక్షన్లో వచ్చిన హై హై నాయక,బావ బావ పన్నీరు సినిమాలతో నటుడిగా తనదైన మార్క్ ను చూపించారు.నరేష్ సినిమాల్లోనే కాకుండా ప్రతి రోజు ఎదో ఒక కాంట్రవర్సీ తో న్యూస్ లో ఉంటాడు.

Telugu Malli Pelli, Naresh, Pavithra, Tollywood, Vijaya Nirmala-Movie

ఇక ఇప్పుడు మళ్లీ పెళ్లి( malli pelli ) అనే టీజర్ రిలీజ్ అయిందో లేదో మళ్ళీ కాంట్రవర్సీ లో నిలుస్తున్నాడు…అలాగే తన భార్య గురించి చెప్పడానికే ఈ సినిమా తీసినట్టు తెలుస్తుంది…అయితే నరేష్ అంతకు ముందు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూ లో పెళ్లి వ్యవస్థ గురించి కొన్ని సంచలనకరమైన మాటలే మాట్లాడారు.ప్రస్తుతం పెళ్లి అంటే ఒక కమిట్మెంట్ కాదు,జస్ట్ అడ్జెస్ట్మెంట్ అని అన్నారు అలాగే పెళ్లి అంటే ఒకప్పుడు అన్ని విషయాలు భార్యభర్తలు ఇద్దరు షేర్ చేసుకునేవారు,కానీ ఇప్పుడు ఇద్దరు ఒకే ఇంట్లో ఉంటున్న ఎవరి ఫోన్ వారికీ ఉంటుంది ఎవరి కారు వాళ్ళకి ఉంటుంది ఒకరి ఫోన్ ఒకరు చూసుకోకూడదు ఇలా కొన్ని బౌండరీస్ పెట్టుకొని బతుకుతున్నాం అలాంటప్పుడు వచ్చే జనరేషన్ కి పెళ్లి మీద ఇంట్రెస్ట్ పోతుంది.ఎందుకంటే పెళ్లి చేసుకుంటే ఇద్దరి మధ్య అండర్ స్టాండింగ్ లేకపోతే విడాకులు తీసుకోవాలి అని వాళ్ళు భయపడి పోయి ముందే పెళ్లి చేసుకోకూడదు అని డిసైడ్ అవుతున్నారు.

 Naresh Made Sensational Comments On The Wedding, Naresh, Vijaya Nirmala, Malli P-TeluguStop.com
Telugu Malli Pelli, Naresh, Pavithra, Tollywood, Vijaya Nirmala-Movie

అలాగే డివోర్స్ తీసుకోవాలి అనుకొని కోర్ట్ కి వెళ్తే అక్కడ లా కూడా ఆడవాళ్ళ పక్షం లోనే ఉంది కాబట్టి మగాడికి జరిగే అన్యాయం గురించి ఎవరు పట్టించుకోవట్లేదు.దాంతో వాళ్ళు భయపడిపోయి సూసైడ్ చేసుకొని చనిపోతున్నారు ఇప్పటికైనా కాస్త వాటిని మార్చితే మగాళ్ల చావులు తగ్గుతాయి అని చెప్పారు…అలాగే డివోర్స్ కూడా తొందరగా వచ్చే విధంగా ఉండాలి అని చెప్పారు.ఇక సినిమాల విషయానికి వస్తే క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నరేష్ ఇప్పుడు చాలా సినిమాల్లో నటిస్తున్నారు.

కెరియర్ పరంగా తాను బిజీగా ఉన్నప్పటికీ ఇలా ఎదో ఒక విషయంతో తాను ఎప్పుడూ కాంట్రవర్సీలు చేస్తూనే ఉంటాడు ఇక అప్పుడెప్పుడో ఇంటర్వ్యూ ఇచ్చిన వీడియో ఇప్పుడు నెట్లో తెగ వైరల్ అవుతుంది…

.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube