కలకలం రేపుతున్న యూఎస్ ఆర్మీ లేడీ ఆఫీసర్ ఆత్మహత్య...

మాజీ US ఆర్మీ సైనికురాలు( US Army soldier ) ఆత్మహత్య చేసుకోవడం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.ఆమె ఒక ప్రముఖ ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్ కూడా.

 U.s. Army Lady Officer S Suicide Causing A Stir , Michelle Young, Fitness Influ-TeluguStop.com

సడన్‌గా ఆమె ఆత్మహత్య చేసుకుందనే వార్తతో చాలా మంది షాక్ అయ్యారు.ఆమె పేరు మిచెల్ యంగ్, ఆమె US ఆర్మీ సైనికురాలుగా విశేషమైన సేవలు అందించింది.

ఆమె కుమార్తె గ్రేసీకి 12 ఏళ్లు నిండిన కొద్ది రోజులకే ఆమె మరణించింది.చనిపోయే ముందు, మిచెల్( Michelle Young ) తన, తన కుమార్తె గ్రేసీల చిత్రాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.

గ్రేసీ తనకు తెలిసిన మోస్ట్ స్వీటెస్ట్ గర్ల్ అని ఆమె రాసింది.గ్రేసీ దృఢంగా, తెలివిగా, ఫన్నీగా, దయగలదని ఆమె ప్రశంసించింది.

ఆమె మరణించినప్పుడు ఆమె వయస్సు 34 సంవత్సరాలు అని యంగ్ స్నేహితులు ధృవీకరించారు.వారు సోషల్ మీడియా, నిధుల సేకరణ పేజీలో ఆమెకు నివాళులర్పించారు.

ఆమె ఒక వీర సైనికురాలు, ప్రేమగల తల్లి అని వారు చెప్పారు.

Telugu Afghanistan, Gracie, Page, Michelle Young, Nri, Tribute, Soldier-Telugu N

మిచెల్ యంగ్ ఒక ప్రముఖ సోషల్ మీడియా పర్సనాలిటీ, ఫిట్‌నెస్ ఇన్‌ఫ్లుయెన్సర్.ఆమెకు సోషల్ మీడియాలో లక్ష మందికి పైగా ఫాలోవర్లు ఉన్నారు.ఆమె US ఆర్మీలో మాజీ స్టాఫ్ సార్జెంట్ కూడా.

ఆమె ఆఫ్ఘనిస్తాన్‌( Afghanistan )లో రెండుసార్లు సేవ చేసింది, తన ఖాళీ సమయంలో ఇతరులకు సహాయం చేసింది.యంగ్ అరిజోనాలోని ప్రెస్‌కాట్‌లో జన్మించింది.17 ఏళ్ల వయసులో ఆర్మీలో చేరింది.గ్రేసీకి రెండేళ్ల వయసులో ఆమె మొదటిసారి ఆఫ్ఘనిస్తాన్‌కు తిరిగి వచ్చింది.

ఆమె అన్నింటికంటే ఎక్కువగా గ్రేసీని ప్రేమించింది.

Telugu Afghanistan, Gracie, Page, Michelle Young, Nri, Tribute, Soldier-Telugu N

యంగ్ స్నేహితుల్లో ఒకరైన సారా మైనే నిధుల సేకరణ పేజీలో ఆమె గురించి రాశారు.మంచి స్నేహితుడు, అథ్లెట్ మిచెల్ ఆత్మహత్య చేసుకున్నట్లు ధ్రువీకరించారు.ఈ చేదు నిజాన్ని జీర్ణించుకోలేకపోతున్నట్లు తెలిపారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు NRI వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube