Tyrannosaurus Rex Skull : పుర్రె ఖరీదు రూ. 162 కోట్లు.. అరుదైన పుర్రె

వేల సంవత్సరాల క్రితం డైనోసర్‌ అనే పెద్ద రాక్షస బల్లులు ఉండేవి అని కథలు కథలుగా విన్నాం.

టెరన్నోసారస్‌ రెక్స్‌ అనే మరో డైనోసర్‌ జాతి గురించి మనం ఇంతవరకు వినలేదు కదా!.

ఇది డైనోసర్‌లో అతి పెద్ధ సరీసృపం.వీటిని టీ రెక్స్‌గా వ్యవహరిస్తారు కూడా.

ఇవి ఒకప్పుడూ ఉత్తర అమెరికాలో ఉండేవట.ఐతే వీటీని టెరన్నోసారస్‌ రెక్స్‌ అని ఎందుకంటారంటే.

లాటిన్‌లో టీ రెక్స్‌ అంటే రాజు అని అర్థం.అతిపెద్ద థెరోపాడ్‌ డైనోసార్‌ జాతి కాబట్టి దీనిని ఆ పేరుతో వ్యవహరించారు.

Advertisement

ఆ టీ రెక్స్‌ పుర్రె ఒకటి తవ్వకాల్లో లభించింది.దీన్ని వేలం వేస్తే దాదాపు రూ.162 కోట్లు వరకు పలుకుతుందంటున్నారు.యూఎస్‌లోని దక్షిణ డకోటాలో టీ రెక్స్‌ డైనోసర్‌ పుర్రెని కనుగొన్నారు పరిశోధకలు.

ఇదోక విలక్షణమైన పుర్రె అని చెబుతున్నారు.ఎలాంటి రసాయనాలతో దీన్ని సురక్షితంగా ఉంచకపోయినప్పటికీ ఇప్పటికీ ఈ శిలాజం చెక్కు చెదరకుండా ఉండటంతో పరిశోధకులు ఆశ్చర్యపోతున్నారు.

ఈ వెలికితీసిన పుర్రె ఆకారం ఉపరితలం చాలా వరకు పాడవ్వవకుండా ఉండేటేమే కాక, అతి సున్నితమైన ఎముకలు సైతం చెక్కుచెదరకుండా ఉన్నాయన్నారు.

ఈ పుర్రె సుమారు 6 నుంచి 7 అడుగులతో దాదాపు 200 పౌండ్లపైన బరువు ఉండచ్చని చెబుతున్నారు.ఇది సుమారు 76 మిలియన్ల ఏళ్ల పురాతనమైనదని పరిశోధకులు భావిస్తున్నారు.ఈ టైరన్నోసారస్‌ తన జాతిలో మరో టైరన్నోసారస్‌తో తలపడి ఉండవచ్చని, అందువల్లే దాని పుర్రెలో రెండు పంక్చర్‌లు కనిపిస్తున్నాయని అన్నారు.

ఆక‌లిగా లేదని భోజ‌నం మానేస్తున్నారా.. అయితే ఈ సైడ్ ఎఫెక్ట్స్ ఖాయం..!
'హెలికాప్టర్ ' కోసం ఇంత పంచాయతీ జరుగుతోందా ? 

ఇలాంటి జీవి పుర్రె తవ్వకాల్లో లభించడం అత్యంత అరుదని చెబుతున్నారు.ఐతే ఈ జీవి పుర్రె చెక్కు చెదరలేదుగానీ అస్తిపంజరం చాలావరకు కోతకు గురైందని అన్నారు.ఈ పుర్రెని మాక్సిమస్‌గా పిలుస్తున్నారు శాస్త్రవేత్తలు.ఇది వేలంలో సుమారు రూ.122 కోట్లు నుంచి రూ.162 కోట్లు వరకు పలుకుతుందని పరిశోధకులు అంచనా వేస్తున్నారు.

Advertisement

గతంలో నైరుతి చైనా ప్రావిన్స్‌ అయిన సిచువాన్‌లోని ఓ రెస్టారెంట్ టేబుల్ కింద 100 మిలియన్ సంవత్సరాల నాటి డైనోసర్ పాదముద్రలను ఔ హాంగ్‌టో అనే వ్యక్తి కనుగొన్నాడు.ఆ సమాచారాన్ని పరిశోధకులకు అందించడంతో.డాక్టర్ లిడా జింగ్ నేతృత్వంలోని నిపుణుల బృందం అక్కడి చేరుకుంది.

పాదముద్రలు రెండు జాతుల సౌరోపాడ్‌లకు చెందినవని.మరీ ముఖ్యంగా ఇవి బ్రోంటోసారస్‌ల గుర్తులను పరిశోధకులు తేల్చారు.

వీటిని భూమిపై నివసించిన అతిపెద్ద జంతువులుగా పరిగణిస్తారు.ఈ డైనోసర్లు 8 మీటర్ల పొడవు ఉండగా.145 నుండి 66 మిలియన్ సంవత్సరాల క్రితం ఇవి జీవించి ఉన్నాయని పేర్కొన్నారు.నగరాల్లోని నిర్మాణ పనులు ఇలాంటి అరుదైన శిలాజాలను అధ్యయనం చేసేందుకు కష్టతరం చేశాయని పరిశోధకులు చెప్పారు.

ఈ పాదముద్రలు చాలా లోతుగా, స్పష్టంగా ఉన్నాయి.వాటి చుట్టూ ఓ కంచెను ఏర్పాటు చేశాం.

అక్కడ రెస్టారెంట్ ఏర్పాటు చేయకముందు.ఆ స్థలంలో ఓ కోళ్ల ఫారమ్ ఉండేది.

ఆ సమయంలో ఆ ప్రదేశంలో ఉన్న ధూళి, ఇసుక పొరలు పాదముద్రలను నాశనం చేయకుండా నిరోధించాయని నిపుణులు భావిస్తున్నారు.

గతంలో ఆస్ట్రేలియాలో శాస్త్రవేత్తలు కొత్త డైనోసర్ జాతి అవశేషాలను కనుగొన్నారు.వీటిని ప్రపంచంలోనే అతిపెద్ద డైనోసర్ల జాతుల్లో ఒకటిగా గుర్తించారు.రైతులు ఈ డైనోసర్ల ఎముకలను కనుగొన్న దశాబ్దం తర్వాత శాస్త్రవేత్తలు వీటి మనుగడ గురించి స్పష్టత ఇచ్చారు.

మొక్కలను తిని జీవించిన ఈ డైనోసర్లు దాదాపు 92 నుంచి 96 మిలియన్ సంవత్సరాల క్రితం క్రెటేషియస్ కాలంలో జీవించి ఉండేవని నిర్ధారించారు.తల పొడవుగా ఉండే ఈ రాకాసి బల్లులు ఆస్ట్రేలియా, అంటార్కిటికా ఒకటిగా ఉన్న కాలంలో నేలపై సంచరించాయి.నడుము వద్ద 5 నుంచి 6.5 అడుగుల ఎత్తు, 25 నుంచి 30 మీటర్ల వరకు పొడవు ఉంటాని శాస్త్రవేత్తలు అంచనా వేశారు.దాదాపు బాస్కెట్ బాల్ కోర్టంత ఉండే ఈ డైనోసర్లు, రెండంతస్తుల భవనమంత ఎత్తు ఉంటాయని పేర్కొన్నారు.

తాజా వార్తలు