Bhola Shankar Chiranjeevi : భోళా శంకర్ సినిమా రీ షూట్‌ వార్తల్లో నిజం ఎంత?

మెగాస్టార్ చిరంజీవి హీరోగా మెహర్ రమేష్ దర్శకత్వం లో రూపొందుతున్న భోళా శంకర్ సినిమా వచ్చే సంవత్సరం సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు రాబోతున్న విషయం తెలిసిందే.ఈ సినిమా లో మెగాస్టార్ చిరంజీవి కి చెల్లి పాత్ర లో కీర్తి సురేష్ నటించిన అంచనాలు భారీ గా ఉన్నాయి.

 Chiranjeevi Bhola Shankar Movie Interesting Update , Bhola Shankar, Bhola Shank-TeluguStop.com

ఈ సినిమా లో హీరోయిన్ గా తమన్నా నటిస్తున్నట్లుగా కూడా తెలుస్తోంది.ఇక ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలు చక చకా జరుగుతున్నాయి అనుకుంటుండగా రీ షూట్‌ ను ప్లాన్ చేశారు అంటూ పుకార్ల షికారులు చేస్తున్నాయి.

గత కొన్ని నెలలుగా ఈ సినిమా కు సంబంధించిన షూటింగ్ కార్యక్రమాలను మెగాస్టార్ చిరంజీవి పూర్తి గా పక్కకు పెట్టాడు, అందుకు కారణం సినిమా షూటింగ్ మెజార్టీ పార్ట్ పూర్తి అయింది.మిగిలిన బ్యాలెన్స్ షూటింగ్ ని వచ్చే ఏడాది ఆరంభం లో పూర్తి చేసి సినిమా ను సమ్మర్ కానుకగా విడుదల చేయాలని భావిస్తున్నారు.

ఈ సమయం లో సినిమా కు సంబంధించిన రీ షూట్ అంటూ వస్తున్న వార్తలు నిజం కాదని మీడియా లో వస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవం అంటూ దర్శకుడు మెహర్ రమేష్ టీమ్ మెంబర్స్ క్లారిటీ ఇచ్చారు.గత కొన్ని రోజులుగా చిరంజీవి పూర్తి గా వాల్తేరు వీరయ్య సినిమా షూటింగ్ కి పరిమితమయ్యాడు.

సంక్రాంతి కి ఆ సినిమా ప్రేక్షకులను ముందుకు రాబోతుంది బాబీ దర్శకత్వం లో పొందుతున్న సింహాలకు సంబంధించి అంచనాలు భారీగా ఉన్నాయి.అందుకే సినిమా పై ఉన్న అంచనా నేపథ్యం లో పెద్ద ఎత్తున బడ్జెట్ కట్ చేసినట్లుగా తెలుస్తోంది.

మరో వైపు తమిళ సూపర్ హిట్ సినిమా వేదాళం కి రీమేక్ గా భోళా శంకర్ సినిమా పై కూడా అంచనాల భారీగా ఉన్నాయి.అందుకే దర్శకుడు మెహర్ రమేష్ ప్రతి విషయం లో కూడా జాగ్రత్తలు తీసుకుంటూ మెల్ల గా షూటింగ్ జరుగుతున్నట్లుగా తెలుస్తోంది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube