రెండేళ్ల నరకానికి ఫలితం దక్కింది... కంటతడి పెట్టుకున్న సాయి ధరమ్ తేజ్!

మెగా హీరో సాయిధరమ్ తేజ్ తాజాగా విరూపాక్ష (Virupaksha) సినిమా ద్వారా ప్రేక్షకులు ముందుకు వచ్చారు.ఎన్నో అంచనాల నడుమ ఈ సినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చి మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది.

 Two Years Of Hell Paid Off Tearful Sai Dharam Tej ,virupaksha , Karthik Dandu ,-TeluguStop.com

ఇలా ఈ సినిమాకు మొదటి షో నుంచి పాజిటివ్ టాక్ రావడంతో మెగా అభిమానులు ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఇక ఈ సినిమా విడుదలైన తర్వాత ప్రేక్షకులతో కలిసి థియేటర్లో సినిమా చూసినటువంటి సాయి ధరమ్ తేజ్ ( Sai Dharam Tej ).సినిమా పూర్తి అవ్వగానే థియేటర్ బయటకు వచ్చి ఈ సినిమాకు ప్రేక్షకుల నుంచి వస్తున్నటువంటి ఆదరణ చూసి కన్నీళ్లు పెట్టుకున్నారు.

ఈ క్రమంలోనే డైరెక్టర్ కార్తీక్ దండు( Karthik Dandu ) ను ఒక్కసారిగా హగ్ చేసుకుని కన్నీళ్లు పెట్టుకున్నారు.ప్రస్తుతం ఇందుకు సంబంధించినటువంటి వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.సాయిధరమ్ తేజ్ కి ఈ సినిమా ఎంతో స్పెషల్ అనే చెప్పాలి.

రెండేళ్ల క్రితం ప్రమాదానికి గురైన సాయి ధరమ్ తేజ్ ఎన్నో ఇబ్బందులను ఎదుర్కొని ఆ ఇబ్బందుల నుంచి బయటపడి తిరిగి సినిమాలలోకి వచ్చారు.సినిమా షూటింగ్ సమయంలో కూడా ఇబ్బందులు ఎదురవుతున్న లెక్కచేయకుండా తన లక్ష్యాన్ని చేరుకునే దిశగా అడుగులు వేశారు.

సినిమా షూటింగ్ పూర్తి అయిన ఆయన రెస్ట్ తీసుకోకుండా ప్రమోషన్ కార్యక్రమాలను( Promotional programs ) కూడా తన భుజాన వేసుకొని వరుస ఇంటర్వ్యూలలో పాల్గొంటూ సినిమాకు కావలసిన స్థాయిలో ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించారు.ఇలా సినిమా కోసం ఎంతో కృషి చేసిన సాయి ధరమ్ తేజ్ కి ఈ సినిమా అనుకున్న స్థాయిలో ఫలితాన్ని అందించిందని చెప్పాలి.ఇలా రెండు సంవత్సరాలు ఈయన అనుభవించిన ఆ నరకానికి సరైన ఫలితం దక్కడంతో ఒక్కసారిగా హీరో ఎమోషనల్ అయ్యారు.ప్రస్తుతం పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్న ఈ సినిమా కలెక్షన్లను కూడా రాబడితే సాయిధరమ్ కెరియర్ లో ఈ సినిమా ఎప్పటికీ గుర్తుండిపోతుందని చెప్పాలి.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube