మహిళా పోలీసును చెప్పుతో కొట్టిన అక్కాచెల్లెళ్లు.. మామూలుగా లేదుగా!

సామాన్యంగా మనం ఎవరితోనైనా గడవ పడితే లేదా మనతో ఎవరైనా గొడవ పడితే వారిని భయపెట్టేందుకు పోలీసులు వస్తున్నారనో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని భయపెడుతుంటాం.అనవసరంగా పోలీసుల వరకూ ఎందుకని చాలా సార్లు మనం కాంప్రమైజ్ అవుతుంటాం.

 Two Sisters Beat Up Female Inspector Details, Sisters Beat Inspector, Bihar, Pat-TeluguStop.com

లేదంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నా, తిట్టుకున్నా పోలీసులు వస్తున్నారంటే ఇద్దరూ పారిపోవడం కూడా చూస్తుంటాం.కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు అక్కాచెల్లెల్లు కలిసి ఓ మహిళా పోలీసు అధికారిపై దాడికి దిగారు.ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.

అసలేం జరిగిందంటే.?

బిహీర్ పట్నాలోని రామ కృష్ణానగర్ పోలీస్ స్టేషన్ లో అక్కా చెల్లెళ్లు వీరంగం సృష్టించారు.ఎవరో చైన్ స్నాచర్లు వీరి ఫోన్ ను దొంగిలించారు.

ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.పోలీసులతో గొడవపడి మహిళా ఇన్స్ పెక్టర్ పై చెప్పులతో దాడికి దిగారు.

ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు వస్తే… దాదాప మూడు గంటల పాటు వేచి చూసేలా చేశారు.

దీంతో కోపోద్రిక్తులైన అక్కాచెల్లెల్లు… పోలీసులపై దాడికి దిగారు.వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు వీరిని జైలుకు పంపారు.ఇద్దరు యువతులు పట్నాలోని బీర్ ప్రాంతంలో రోడ్డుపై నడుస్తుండగా… బైక్ మీద వచ్చిన ఆగంతకులు మొబైల్ లాక్కొని పారిపోయారు.ఈ విషయం తేల్చుకొని నిందితులపై కేసు నమోదు చేయించడానికి బదులుగా వీరిపైనే కేసు నమోదయ్యేలా చేస్కున్నారు.

అక్కా చెల్లెళ్లు ఇద్దరిపై కూడా కేసు నమోదు అయింది.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube