బింబిసార కోసం రావణ్.. ఒకే వేదికపైకి నందమూరి అన్నదమ్ములు..!

అనుకున్నదే నిజం అయ్యింది.అన్న కోసం తమ్ముడు తరలి రాబోతున్నాడు.

 Ntr As The Chief Guest Of Bimbisara Grand Pre-release Event, Bimbisara Grand Pre-TeluguStop.com

నందమూరి అన్నదమ్ములు చాలా రోజుల తర్వాత మరోసారి స్టేజ్ పంచుకోనున్నారు.ఇలాంటి తరుణం కోసం నందమూరి ఫ్యాన్స్ అంతా ఎదురు చూస్తూ ఉంటారు.

ఇక ముందు నుండి వార్తలు వచ్చిన ప్రకారం అన్న కళ్యాణ్ రామ్ కోసం తమ్ముడు తారక రామారావు దిగి వస్తున్నాడు.అన్న కెరీర్ లో హైయెస్ట్ బడ్జెట్ తో తెరకెక్కుతున్న సినిమా కోసం తనవంతు సహాయం చేయడానికి ముందు వచ్చాడు.

ఈ మేరకు తాజాగా ఒక వీడియో విడుదల అయ్యింది.వివరాల్లోకి వెళ్తే.

నందమూరి హీరో కళ్యాణ్ రామ్ నటించిన లేటెస్ట్ పీరియాడిక్ సినిమా బింబిసార.ఈ సినిమాను అత్యంత భారీ బడ్జెట్ తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించారు.

యువ డైరెక్టర్ వసిష్ఠ మల్లిడి దర్శకత్వంలో ఈ సినిమా పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కింది.ఎన్టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై కే హరికృష్ణ నిర్మించిన ఈ సినిమా ఆగష్టు 5న రిలీజ్ అయ్యేందుకు సిద్ధం అయ్యింది.

ఈ సినిమాలో సంయుక్త మీనన్, క్యాథరిన్ త్రెసా, వరీన హుస్సేన్ హీరోయిన్ లుగా నటిస్తున్నారు.ఆగష్టు 5న రిలీజ్ కాబోతున్న ఈ సినిమా ప్రొమోషన్స్ స్టార్ట్ చేసింది.

అయితే కళ్యాణ్ రామ్ ఒక్కడితో ఇది మరింత హైప్ తెచ్చుకోవడం కష్టమే.దీంతో ఈ సినిమా కోసం తన తమ్ముడు ఎన్టీఆర్ ను రంగంలోకి దింపుతున్నారు.

ఈ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ కు చీఫ్ గెస్ట్ గా ఎన్టీఆర్ రాబోతున్నారట.హైదరాబాద్ లోని శిల్పకళా వేదికలో జులై 29న ప్రీ రిలీజ్ ఈవెంట్ గ్రాండ్ గా జరగనుంది.

ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథిగా ఎన్టీఆర్ రాబోతున్నాడు.ఈ విషయాన్నీ తాజాగా మేకర్స్ అధికారికంగా అనౌన్స్ చేసారు.వస్తున్నాడు అంటూ ఎన్టీఆర్ లవకుశ సినిమాలోని రావణ్ పాత్రను కట్ చేసి వీడియో వదిలారు.ఈ వీడియో ఇప్పుడు ఫ్యాన్స్ ను బాగా ఆకట్టుకుంటుంది.మరి ఎన్టీఆర్ కొత్త గెటప్ ఎలా ఉంటుందో అని అంతా ఆతృతగా ఎదురు చూస్తున్న తరుణంలో ఈ వేడుకకు రాబోతుండడంతో ఫ్యాన్స్ మరింత హర్షం వ్యక్తం చేస్తున్నారు.ఒకే వేదికపైకి నందమూరి అన్నదమ్ములు రాబోతుండడంతో ఆ రోజు కోసం ఎదురు చూస్తున్నారు.

https://youtu.be/eRCENTPfbpM
Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube