సుధీర్ చేసిన ఆ ఒక్క పనితో షాకైన అభిమానులు.. అసలేం జరిగిందంటే?

బుల్లితెర యాంకర్లలో ఒకరైన సుడిగాలి సుధీర్ కు ఊహించని స్థాయిలో అభిమానులు ఉన్నారు.సుడిగాలి సుధీర్ ఈటీవీ ఛానల్ కు దూరమై మాటీవీ ఛానల్ కు దగ్గరైనా అతనిని అభిమానించే అభిమానుల సంఖ్య ఏమాత్రం తగ్గలేదు.

 Sudheer Huge Shock To Fans Details Here Goes Viral , Sudheer , Anasuya , Hemacha-TeluguStop.com

సుడిగాలి సుధీర్ ప్రస్తుతం సూపర్ సింగర్ జూనియర్ షోకు హోస్ట్ గా వ్యవహరిస్తున్నారు.సుధీర్, అనసూయ కలిసి చేస్తున్న ఈ షో ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటోంది.

సుధీర్ మంచి సింగర్ అనే విషయాన్ని ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.అయితే తాజాగా సూపర్ సింగర్ జూనియర్ ప్రోమో రిలీజ్ కాగా ఈ ప్రోమోలో సుధీర్, చిత్ర కలిసి పాట పాడారు.

సుధీర్ బాగానే పాటలు పాడతాడని తెలిసినా అతను ప్రొఫెషనల్ సింగర్ కాదనే సంగతి తెలిసిందే.అయినప్పటికీ సుధీర్ అందం హిందోళం పాటను అద్భుతంగా పాడారు.హేమచంద్ర సుధీర్ కు నేను ఇప్పటికే పెద్ద ఫ్యాన్ అని అయితే సుధీర్ డెడికేషన్ కు మరింత పెద్ద ఫ్యాన్ అయ్యానని తెలిపారు.

Telugu Anasuya, Fans, Hemachandra, Shock, Sudheer, Promo-Movie

సుధీర్ సింగింగ్ టాలెంట్ ను నెటిజన్లు సైతం మెచ్చుకుంటున్నారు.ప్రోమోలో సుధీర్, అనసూయ నక్కలీసు గొలుసు పాటతో ఎంట్రీ ఇచ్చారు.అనసూయ సుధీర్ తో పద్ధతి, పాడులో పద్ధతి లేకుండా పాడుతో వచ్చినట్టు ఉన్నారని చెప్పగా సుధీర్ మాదీ పల్లెటూరే అని ఇప్పుడు దానికి సిటీ అని పేరు పెట్టారని చెప్పుకొచ్చారు.

ఏ సిటీ అని అనసూయ అడగగా పబ్లిసిటీ అని సుధీర్ బదులివ్వడం గమనార్హం.

నేను కూడా అప్పుడొకసారి సిటీకి వచ్చానని ఆ సిటీ సింప్లిసిటీ అని అనసూయ కామెంట్లు చేశారు.

ఈ పంచ్ డైలాగ్స్ వింటుంటే నేను స్కార్సిటీకి వెళ్లానని అనసూయ పేర్కొన్నారు.ప్రస్తుతం అనసూయ చేసిన కామెంట్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

సుధీర్ ప్రతిభను మాత్రం నెటిజన్లు తెగ మెచ్చుకుంటున్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube