మహిళా పోలీసును చెప్పుతో కొట్టిన అక్కాచెల్లెళ్లు.. మామూలుగా లేదుగా!

సామాన్యంగా మనం ఎవరితోనైనా గడవ పడితే లేదా మనతో ఎవరైనా గొడవ పడితే వారిని భయపెట్టేందుకు పోలీసులు వస్తున్నారనో లేదా పోలీసులకు ఫిర్యాదు చేస్తానని భయపెడుతుంటాం.

అనవసరంగా పోలీసుల వరకూ ఎందుకని చాలా సార్లు మనం కాంప్రమైజ్ అవుతుంటాం.లేదంటే ఇద్దరు వ్యక్తులు కొట్టుకున్నా, తిట్టుకున్నా పోలీసులు వస్తున్నారంటే ఇద్దరూ పారిపోవడం కూడా చూస్తుంటాం.

కానీ ఇక్కడ మాత్రం ఇద్దరు అక్కాచెల్లెల్లు కలిసి ఓ మహిళా పోలీసు అధికారిపై దాడికి దిగారు.

ఈ విషయం ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.h3 Class=subheader-styleఅసలేం జరిగిందంటే.

?/h3p బిహీర్ పట్నాలోని రామ కృష్ణానగర్ పోలీస్ స్టేషన్ లో అక్కా చెల్లెళ్లు వీరంగం సృష్టించారు.

ఎవరో చైన్ స్నాచర్లు వీరి ఫోన్ ను దొంగిలించారు.ఇదే విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు.

పోలీసులతో గొడవపడి మహిళా ఇన్స్ పెక్టర్ పై చెప్పులతో దాడికి దిగారు.ఈ ఘటన ప్రస్తుతం చర్చనీయాంశంగా మారింది.

ఫోన్ పోయిందని ఫిర్యాదు చేసేందుకు వస్తే.దాదాప మూడు గంటల పాటు వేచి చూసేలా చేశారు.

దీంతో కోపోద్రిక్తులైన అక్కాచెల్లెల్లు.పోలీసులపై దాడికి దిగారు.

వీరిపై కేసు నమోదు చేసిన పోలీసులు వీరిని జైలుకు పంపారు.ఇద్దరు యువతులు పట్నాలోని బీర్ ప్రాంతంలో రోడ్డుపై నడుస్తుండగా.

బైక్ మీద వచ్చిన ఆగంతకులు మొబైల్ లాక్కొని పారిపోయారు.ఈ విషయం తేల్చుకొని నిందితులపై కేసు నమోదు చేయించడానికి బదులుగా వీరిపైనే కేసు నమోదయ్యేలా చేస్కున్నారు.

అక్కా చెల్లెళ్లు ఇద్దరిపై కూడా కేసు నమోదు అయింది.

దేశానికి ఏం సేవ చేశాడు : నిజ్జర్‌కు కెనడా పార్లమెంట్ నివాళిపై భారత సంతతి ఎంపీ అసంతృప్తి