అమెరికాలో విద్వేష దాడి ఘటనలు మళ్లీ ఎక్కువవుతున్నాయి.ఆసియా సంతతి వారిని ముఖ్యంగా భారతీయులను స్థానికులు లక్ష్యంగా చేసుకుంటున్నారు.వీరిలో సిక్కుల సంఖ్య అధికంగా వుంటోంది.10 రోజుల క్రితం మార్నింగ్ వాక్‌కు వెళ్లిన 75 ఏళ్ల సిక్కు వృద్ధుడిపై న్యూయార్క్‌లో ఓ అగంతకుడు దాడి చేసిన ఘటన మరవకముందే .మరో సంఘటన చోటు చేసుకుంది.
న్యూయార్క్‌లోని రిచమండ్ హిల్స్ ప్రాంతంలో మంగళవారం ఈ ఘటన జరిగినట్లుగా తెలుస్తోంది.
దీనికి సంబంధించి పోలీసులు ఒకరిని అరెస్ట్ చేశారు.సిక్కు పెద్దాయనపై దాడి జరిగిన చోటే.
మార్కింగ్ వాక్ చేస్తున్న ఇద్దరు యువకులపై ఇద్దరు స్థానికులు దాడికి దిగారు.వారిని రాడ్‌తో చితకబాది.
అంతటితో ఆగక తలపాగాను కూడా లాగేసినట్లు స్థానిక మీడియా కథనాలను ప్రసారం చేస్తున్నాయి.
న్యూయార్క్ అటార్నీ జనరల్ లెటిటియా జేమ్స్ ఈ ఘటనను ఖండించారు.
రిచ్‌మండ్ హిల్‌లో సిక్కు సమాజంపై జరిగినది ద్వేషపూరిత దాడి అని.దీనికి బాధ్యులైన ఇద్దరిని కోర్టులో హాజరుపరుస్తామన్నారు.దీనికి సంబంధించి ఎలాంటి వివరాలు తెలిసినా పోలీసులకు సమాచారం అందించాలని జేమ్స్ విజ్ఞప్తి చేశారు.

న్యూయార్క్ రాష్ట్ర కార్యాలయానికి ఎన్నుకోబడిన తొలి పంజాబీ అమెరికన్ మహిళ జెనిఫర్ రాజ్‌కుమార్ ఈ ఘటన పట్ల దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.ఇటీవలి కాలంలో సిక్కు సమాజంపై విద్వేషపూరిత నేరాలు 200 శాతం పెరిగాయని ఆమె అన్నారు.పది రోజుల వ్యవధిలో జరిగిన ఈ రెండు ఘటనలను ద్వేషపూరిత నేరాలుగా పరిగణించాలని.
నేరస్తులను విచారించాల్సిందిగా న్యూయార్క్ పోలీస్ శాఖను కోరినట్లు జెనిఫర్ తెలిపారు.ఢిల్లీకి చెందిన సిక్కు నేత మంజీందర్ సింగ్ సిర్సా ఈ వీడియోను షేర్ చేయడంతో దాడి ఘటన వెలుగులోకి వచ్చింది.దీనిని విద్వేష దాడిగా పరిగణనలోనికి తీసుకుని నేరస్తులను శిక్షించాల్సిందిగా ఆయన అమెరికా ప్రభుత్వాన్ని కోరారు.మరోవైపు… న్యూయార్క్ బ్రూక్లిన్ సబ్‌వేలో కాల్పుల ఘటన జరిగిన రోజునే సిక్కులపై దాడి జరగడం ప్రాధాన్యత సంతరించుకుంది.