కృష్ణా జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం జరిగింది.అదుపుతప్పి ఓ ఆటో బోల్తా పడింది.
ఈ ఘటన గన్నవరం మండలం( Gannavaram ) వీరప్పనేనిగూడెంలో చోటు చేసుకుంది.కాగా ఈ ప్రమాదంలో ఇద్దరు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు.
మరో 16 మందికి గాయాలు అయ్యాయి.సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
బాధితులను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించిన పోలీసులు ప్రమాదంపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.