పార్వతీపురం మన్యం జిల్లాలో విషాద ఘటన చోటుచేసుకుంది.బండరాళ్లు పడి ఇద్దరు కార్మికులు మృత్యువాత పడ్డారు.
కొండపై డ్రిల్లింగ్ చేస్తుండగా ప్రమాదవశాత్తూ కూలీలపై బండరాళ్లు పడినట్లు తెలుస్తోంది.ఈ ఘటనలో ఇద్దరు మరణించగా మరొకరు తీవ్రంగా గాయపడ్డారు.
సాలూరు మండలం కొత్తవలస విజయ స్టోన్ క్రషర్ లో జరిగింది.సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని సమీక్షించారు.
అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.







