బాలీవుడ్ లో పార్టీలు ఎక్కువగా చూస్తూ ఉంటాం.స్టార్స్ మరియు సెలబ్రెటీల యొక్క బర్త్ డే పార్టీలు రెగ్యులర్ గా మనం చూస్తూనే ఉంటాం.
ఒక స్టార్ బర్త్ డే పార్టీకి బాలీవుడ్ స్టార్స్ అంతా వెళ్లడం చాలా సందర్భాల్లో చూశాం.స్టార్ హీరోలు మరియు స్టార్ హీరోయిన్స్ యొక్క బర్త్ డే పార్టీ లు కన్నుల విందుగా జరుగుతూ ఉంటాయి.
పదుల కొద్ది స్టార్స్ హాజరు అవుతూ ఉండే ఆ వేడుకల్లో పాల్గొనెందుకు ఇతర సెలబ్రెటీలు పోటీ పడుతూ ఉంటారు.అలాంటి సెలబ్రేషన్స్ లో

పాల్గొనడం ద్వారా పాపులారిటీని పెంచుకోవాలని ఆశ పడే వారు కూడా ఉంటారు.ఇప్పుడు అలాంటి బర్త్ డే పార్టీ లు తెలుగు సినిమా పరిశ్రమలో కూడా మొదలు అయ్యాయి.తాజాగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ( Ram Charan )బర్త్ డే వేడుకను చిరంజీవి( Chiranjeevi ) ఇంట్లో వైభవంగా నిర్వహించారు.
టాలీవుడ్ స్టార్స్ తో పాటు పలువురు ప్రముఖులు ఈ బర్త్ డే పార్టీ లో పాల్గొన్నారు.పెద్ద ఎత్తున బర్త్ డే పార్టీకి సంబంధించిన హడావుడి కూడా మీడియాలో కనిపించింది.

సోషల్ మీడియాలో చరణ్ బర్త్ డే బష్ ఫొటోలు వైరల్ అయ్యాయి.విజయ్ దేవరకొండ.నాగార్జున.అఖిల్.నాగ చైతన్య.రాజమౌళి ఇంకా పలువురు ప్రముఖులు కూడా హాజరు అయ్యారు.
ఈ బర్త్ డే పార్టీ కారణంగా చాలా మంది సెలబ్రెటీలు ఒక్క చోటుకు చేరినట్లు అవుతుంది.తద్వారా టాలీవుడ్ లో మంచి వాతావరణం ఉందని చెప్పుకోవచ్చు.
హీరోలు ఎక్కువ శాతం మంది రాకున్నా కూడా ఇండస్ట్రీ లో మంచి వాతావరణం ఉందనే అభిప్రాయంను కలిగించే అవకాశం ఉంది.రామ్ చరణ్.
ఉపాసన.చిరంజీవి పార్టీ లో ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు.
బేబీ బంప్ తో ఉపాసన సందడి చేశారు.సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఫొటోలు మరియు వీడియో మెగా ఫ్యాన్స్ కు కన్నుల విందు చేస్తున్నాయి.







