ఎలాన్ మాస్క్( Elon Mask ) ట్విట్టర్ ను కొనుగోలు చేసినప్పటి నుండి సరికొత్త మార్పులు చోటు చేసుకుంటూనే ఉన్నాయి.వివిధ యాప్ లు ట్విట్టర్ కు గట్టి పోటీ ఇస్తూ ఉండడంతో ట్విట్టర్లో ఎప్పటికప్పుడు సరికొత్త ఫీచర్లులు అందుబాటులోకి వస్తున్నాయి.
తాజాగా ఎలాన్ మాస్క్ మరో రెండు సరికొత్త ఫీచర్లను ట్విట్టర్లో తీసుకు వస్తున్నట్లు ట్విట్ చేశారు.సోషల్ మీడియాలో ఓ నెటిజన్ ట్విటర్లో పోస్ట్ చేసే వీడియోలకు 15 సెకండ్ల ఫార్వర్డ్, బ్యాక్ బటన్లను యాడ్ చేయాలని మాస్క్ ను ట్యాగ్ చేస్తూ ట్విట్ చేశాడు.
ఈ నెటిజన్ అడిగిన ప్రశ్నకు మాస్క్ స్పందిస్తూ.కేవలం ఒక వారంలోనే పిక్-ఇన్-పిక్ మోడ్ తో పాటు ఫార్వర్డ్, బ్యాక్ బటన్లు రానున్నాయని మాస్క్ రీట్వీట్ చేశారు.

ఇక యూట్యూబ్ లో మాదిరిగానే యూజర్లు పిక్-ఇన్-పిక్ మోడ్( Pick-in-pick mode ) తో చిన్న విండోలో వీడియోలు చూస్తూ.వెబ్ పేజ్ లో తమ పని చేసుకోవచ్చని తెలిపారు.ఫార్వర్డ్ ఇక ఫార్వర్డ్, బ్యాక్ బటన్ల ద్వారా వీడియోను ముందుకు లేదా వెనుకకు జరిపే వెసులుబాటు ఉంటుంది.అయితే ఈ ఫీచర్లు ఇప్పటివరకు కేవలం యూట్యూబ్, వాట్సాప్( YouTube, WhatsApp ) లలో మాత్రమే ఉన్నాయి.
ఇకపై ట్విట్టర్ లో కూడా ఈ ఫీచర్లు అందుబాటులోకి రానున్నాయి.

మాస్క్ చేసిన ఈ ట్వీట్ చూసి చాలామంది నెటిజన్స్ హర్షం వ్యక్తం చేస్తూ చాలా రోజుల నుండి ట్విట్టర్లో ఇలాంటి ఫీచర్ల కోసం ఎదురు చూస్తున్నామని కామెంట్లు చేస్తున్నారు.గత ఏడాది ట్విట్టర్ కొనుగోలు జరిగినప్పటినుండి ఎలాన్ మాస్క్ సీఈవో గా వ్యవహరించి, ఇటీవలే లిండా యాకరినో ను ట్విట్టర్ సీఈవో గా నియమించారు.ఈమె బిజినెస్ ఆపరేషన్స్ పై ప్రత్యేక దృష్టి పెడతారని, ప్రోడక్ట్ డిజైన్, కొత్త టెక్నాలజీకి సంబంధించిన వ్యవహారాలను తాను చూసుకుంటానని మాస్క్ తెలిపారు.