వైసిపి ఆఫీసులో కూల్చివేతలు.. లిస్ట్ లో మరో రెండు

ఏపీలో కొత్తగా అధికారం చేపట్టిన టిడిపి ,జనసేన, బిజెపి ( TDP, Janasena, BJP )కూటమి ప్రభుత్వం పూర్తిగా వైసిపిని టార్గెట్ చేసుకున్నట్లుగానే కనిపిస్తుంది.మొన్నటి ఎన్నికల ఫలితాలలో వైసీపీ 11 స్థానాలకే పరిమితం కావడం, కనీసం ప్రతిపక్ష హోదా కూడా దక్కించుకోలేని సంగతి తెలిసిందే.

2019 ఎన్నికల్లో వైసీపీ( YCP ) అధికారంలోకి వచ్చిన వెంటనే గత టిడిపి ప్రభుత్వం హయాంలో నిర్మితం అయిన ప్రజా వేదికను కూల్చివేశారు.ఇప్పుడు దానికి ప్రతీకారం అన్నట్టుగా వైసిపి కార్యాలయాలను కూటమి ప్రభుత్వం టార్గెట్ చేసుకున్నట్టుగా కనిపిస్తోంది.

ఈ మేరకు రాజధాని అమరావతి పరిధిలో నిర్మాణంలో ఉన్న వైసీపీ కేంద్ర కార్యాలయాన్ని ఇప్పటికే కూల్చి వేశారు.రెండు ఎకరాల విస్తీర్ణం లో నిర్మాణంలో ఉన్న భవనాన్ని సిఆర్డిఏ అధికారులు కూల్చివేశారు.

బుల్డోజర్ లు, ప్రోక్లైన్ లతో వాటిని ధ్వంసం చేశారు.

Advertisement

ఇక ఈ కూల్చివేతల పర్వం కొనసాగిస్తామన్నట్లుగా విశాఖపట్నంలో కొత్తగా నిర్మితమైన వైసీపీ భవనానికి నోటీసులు జారీ చేశారు గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ ( Greater Visakhapatnam Municipal Corporation )అధికారులు .వైసిపి కార్యాలయం అక్రమ కట్టడం అని , నిర్మాణంలో ఉల్లంఘనలు చోటుచేసుకున్నాయని నోటీసులు ఇచ్చారు .దాన్ని పార్టీ కార్యాలయానికి అతికించి వెళ్లారు.తాజాగా వైసిపి కి చెందిన మరో పార్టీ భవనానికి నోటీసులు అంటించారు.

అనంతపురంలో కొత్తగా నిర్మాణంలో ఉన్న జిల్లా పార్టీ కార్యాలయం భవనానికి మున్సిపల్ కార్పొరేషన్, డిప్యూటీ సిటీ టౌన్ ప్లానింగ్ అధికారి ఎం హరి ప్రసాద్ నోటీసులు ఇచ్చారు.

అనంతపురంలోని హెచ్ ఎల్ సి కాలనీ నిర్మాణంలో ఉన్న భవనం ఇది.అక్రమ కట్టడం అంటూ టౌన్ ప్లానింగ్ అధికారులు నోటీసులు ఇచ్చారు.ఇక ముందు ముందు మరికొన్ని వైసీపీ కార్యాలయాలను టార్గెట్ చేసుకునే విధంగా కొత్త ప్రభుత్వం ముందుకు వెళ్ళబోతున్నట్లుగా పరిస్థితి కనిపిస్తోంది.

వీటిపై న్యాయ పోరాటం దిశగా వైసీపీ అడుగులు వేస్తోంది.

ప్రత్యేక హోదా : నితీష్ కుమార్ నిప్పు రాజేశారుగా ? బాబు ఏం చేస్తారో ? 
Advertisement

తాజా వార్తలు