కడప జిల్లాలో రోడ్డుప్రమాదం సంభవించింది.లారీని కారు ఢీకొట్టింది.
ఈ ఘటనలో ఇద్దరు మృత్యువాతపడగా… ఐదుగురికి తీవ్రగాయాలు అయ్యాయి.వెంటనే స్పందించిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు.
ఒంటిమిట్ట మండలం నడింపల్లిలో ప్రమాదం చోటు చేసుకుంది.మహబూబ్ నగర్ నుంచి తిరుమల వెళ్తుండగా ఘటన జరిగినట్లు తెలుస్తోంది.