ఇండియాలో ఎలక్ట్రిక్ స్కూటర్లకి బాగా డిమాండ్ పెరిగిపోతుంది.చాలామంది ప్రజలు తక్కువగా ఖర్చుతో ప్రయాణాలు చేయాలనుకుంటే వీటినే ఆప్షన్ ఎన్నుకుంటున్నారు.
కాగా వీటిని కొనాలనే ఆలోచన చేసేవారికి ఏది బెస్ట్ అనేది తెలియడం లేదు.వారికోసం బెస్ట్ 5 ఎలక్ట్రిక్ సైకిళ్లు ఏవో ఇప్పుడు తెలుసుకుందాం.
• మోటో వోల్ట్ కివో
మోటో వోల్ట్ కివో 24 సైకిల్ రూ.29,774 స్టార్టింగ్ ప్రైస్‌తో వస్తోంది.దీని టాప్ ఎండ్ వేరియంట్ రూ.42,159.ఈ సైకిల్ సింగిల్ ఛార్జ్‌పై 70 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.దీని మ్యాక్జిమం స్పీడ్ గంటకు 25 కి.మీ.
• మోటో వోల్ట్ హమ్
ఇకపోతే మోటో వోల్ట్ హమ్ సైకిల్ రూ.31,049కే దొరుకుతుంది.సింగిల్ ఛార్జ్‌పై ఇది 105 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.దీని మ్యాగ్జిమం స్పీడ్ గంటకు 25 కి.మీ.

• హీరో లెక్ట్రో విన్ ఎక్స్
హీరో లెక్ట్రో విన్ ఎక్స్ ఎలక్ట్రిక్ సైకిల్ రూ.44,419 ధరకి లభిస్తుంది.సింగిల్ ఛార్జ్‌పై ఇది 75 కి.మీ రేంజ్ ఆఫర్ చేస్తుంది.దీని మ్యాగ్జిమం స్పీడ్ గంటకు 25 కి.మీ.

• పొలారిటీ స్మార్ట్ ఎగ్జిక్యూటివ్
పొలారిటీ స్మార్ట్ ఎగ్జిక్యూటివ్ ఎలక్ట్రిక్ సైకిల్ రూ.38 వేల నుంచి ప్రారంభం అవుతోంది.దీని టాప్ వేరియంట్ ప్రైస్ రూ.1.05 లక్షల వరకు ఉండటం బెటర్.సింగిల్ ఛార్జ్‌పై ఇది 80 కి.మీ వరకు వస్తుంది.
• పొలారిటీ స్మార్ట్ స్పోర్ట్
పొలారిటీ స్మార్ట్ స్పోర్ట్ ఈ-సైకిల్ రూ.40 వేల నుంచి రూ.1.1 లక్షల వరకు ఉంటుంది.ఈ ఈ-సైకిల్ 80 కి.మీ ఆఫర్ చేస్తుంది.

• నెక్స్‌జు రోడ్ లార్క్
నెక్స్‌జు రోడ్ లార్క్ ఈ-సైకిల్ రూ.45,999కే దొరుకుతోంది.ఇది సింగిల్ ఛార్జ్‌పై 85 కి.మీ స్పీడ్‌తో దూసుకెళ్తుంది.దీని టాప్ స్పీడ్ గంటకు 25 కి.మీ.







