ప్రముఖ జర్నలిస్ట్ రవి ప్రకాశ్‌ను కష్టాలు వెంటాడుతునే ఉన్నాయి.ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్న ఆయన తిరిగి స్రీన్‌పై కనిపించడానికి సిద్దమవుతున్నట్లు తెలుస్తుంది.
రెవంత్ రెడ్డి చేతులు కలిపి కొత్త న్యూస్ ఛానెల్ స్టార్ట్ చేస్తాడని గతంలో వార్తలు వచ్చినప్పటికీ అవన్ని అవాస్తమే అని తెలిపోయింది.అయితే ఆయన మరో ప్లాన్ సిద్దం చేస్తుకున్నట్లు తెలుస్తుంది.
ఎన్‌ఆర్ఐ ప్రేండ్స్‌తో కొత్త వార్త ఛానెల్ ప్రారంభించనున్నట్లు తెలుస్తుంది.ఇందు కోసం త్వరలో విదేశీ పర్యటన చేయనున్నట్లు సమాచారం.
ప్రస్తుతం ఆయన కొర్టులో విచారణ ఎదుర్కొంటున్న నేపథ్యంలో న్యాయ స్థానం అనుమతి లేకుండా విదేశీ పర్యటన కుదరదు.
ఈ మేరకు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసి విదేశాలకు వెళ్లేందుకు వీలుగా కొత్త పాస్‌పోర్టును మంజూరు చేయాలని కోరారు.
ఈ పిటిషన్‌పై కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయాలని పోలీసులను ఆదేశించిన కోర్టు.విచారణను వారం రోజులకు వాయిదా వేసింది.
బంజారాహిల్స్, సైబరాబాద్ పోలీస్ స్టేషన్లలో ఐపీసీ, ఐటీ చట్టంలోని వివిధ సెక్షన్ల కింద తనపై నమోదైన కేసుల్లో గతంలో కోర్టు మంజూరు చేసిన ముందస్తు బెయిల్‌ను సడలించాలని రవిప్రకాష్ పిటిషన్‌లో కోరారు. తన కుమార్తెను కలిసేందుకు అమెరికా వెళ్లేందుకు అనుమతించాలని బుధవారం తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు.
తన క్లయింట్‌ను మే 8, 2019న తన కార్యాలయం నుంచి చట్టవిరుద్ధంగా తొలగించారని, పాస్‌పోర్ట్‌తో సహా ఆఫీసు క్యాబిన్ నుండి అతని వస్తువులను సేకరించడానికి కూడా అనుమతించలేదని రవి ప్రకాష్ తరపు న్యాయవాది హైకోర్టుకు తెలిపారు.ఈ ఏడాది జనవరిలో హైకోర్టు నుండి పాస్‌పోర్ట్ మిస్సింగ్ సర్టిఫికేట్ పొందిన తరువాత, రవి ప్రకాశ్ పాస్‌పోర్ట్ అథారిటీని ఆశ్రయించగా కొత్త పాస్‌పోర్ట్ జారీకి కోర్టు రాత పూర్వక అనుమతి పొందాలని వారు చెప్పడంతో కథంతా మెుదటికి వచ్చింది.
.