మనం ప్రతిరోజు టీవీలో సీరియల్స్ ( TV Serials )లో హీరోలను చూస్తూనే ఉంటాం.అయితే కొందరు హీరోలు ఒకటి రెండు సీరియల్స్ తోనే బాగా పాపులారిటీ సంపాదించుకున్నారు.
అలా బుల్లితెరపై ప్రస్తుతం ఎంతో మంది హీరోలు రాణిస్తున్న విషయం తెలిసిందే.కేవలం తెలుగు వాళ్ళు మాత్రమే కాకుండా ఇతర భాషలకు సంబంధించిన హీరోలు కూడా బుల్లితెరపై రాణిస్తూ భారీగా పాపులారిటీని సంపాదించుకుంటున్నారు.
ఇకపోతే ఈ తెలుగు హీరోలు ఎవరెవరు ఎంతవరకు చదువుకున్నారు.వాళ్ళ ఎడ్యుకేషన్ ఏంటి అన్న విషయాల గురించి ఈరోజు మనం తెలుసుకుందాం.
నిరుపమ్ పరిటాల( Nirupam Paritala ) అంటే చాలామంది గుర్తుపెట్టుకోపోవచ్చు కానీ డాక్టర్ బాబు అంటే చాలు బాగా గుర్తుపట్టేస్తారు.కార్తీకదీపం సీరియల్( Karthikadeep serial ) తో బాగా ఫేమస్ అయిన నిరుపమ్ ఎంబీఏ వరకు చదువుకున్నాడు.అలాగే ప్రేమ ఎంత మధురం సీరియల్ తో మంచి గుర్తింపు తెచ్చుకున్న శ్రీరామ్ వెంకట్ ( Sriram Venkat )బిఎస్సి వరకు చదువుకున్నాడు.నటుడు బిగ్ బాస్ విన్నర్ విజే సన్నీ( Vj Sunny ) బీఎస్సీ వరకు చదువుకున్నాడు.
త్రినయని సీరియల్ ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్న చందు గౌడ( Chandu Gowda ) బీటెక్ వరకు చదువుకున్నాడు.నటుడు కలికిరాజా ఎంబీఏ వరకు చదువుకున్నాడు.దేవత సీరియల్ ఫేమ్ అర్జున్( Arjun ) ఎంసిఏ వరకు చదువుకున్నాడు.రాధమ్మ కూతుర్లు ఫేమ్ గోకుల్ బీటెక్ వరకు చదువుకున్నాడు.
మధుబాబు( Madhubabu ) బీటెక్ వరకు చదువుకున్నాడు.నటుడు ప్రియతమ్ చరణ్( Priyatem Charan ) బీటెక్ సిఎస్సి వరకు చదువుకున్నాడు.జై ధనుష్ బి ఏ వరకు చదువుకున్నాడు.మౌనరాగం సీరియల్ హీరో శివకుమార్ బీటెక్ వరకు చదువుకున్నాడు.నటుడు యాంకర్ రవి కృష్ణ డిగ్రీ వరకు చదువుకున్నాడు.అలాగే నిఖిల్ డిగ్రీ వరకు చదువుకున్నాడు.
కేవలం వీరు మాత్రమే కాకుండా ఇంకా బుల్లితెరపై ఎంతోమంది హీరోలు రాణిస్తున్నారు.