హైదరాబాద్లోని ఉప్పల్లో( Uppal ) కిడ్నాప్ కలకలం చెలరేగింది.ఓ టీవీ ఛానల్ లో యాంకర్ గా పని చేస్తున్న ప్రణవ్( TV Anchor Pranav ) అనే వ్యక్తికి మహిళ కిడ్నాప్ చేసిందని తెలుస్తోంది.
కిడ్నాపర్ల నుంచి తప్పించుకున్న ప్రణవ్ పోలీసులను ఆశ్రయించారు.ప్రణవ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు కిడ్నాప్( Kidnap ) చేసిన మహిళను అరెస్ట్ చేశారు.

అనంతరం నిందితురాలిని రిమాండ్ కు తరలించారు.కాగా ప్రణవ్ ను ట్రాప్ చేసి కిడ్నాప్ చేసినట్లుగా పోలీసులు తెలిపారు.ప్రణవ్ ను కిడ్నాప్ చేసేందుకు త్రిష్ణకు( Trishna ) మరో నలుగురు సహయం చేసినట్లు గుర్తించారు.వీరు పరారీలో ఉన్నారన్న పోలీసులు త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు.







