జగన్ పార్టీలో అలజడి.. కాచుకు కూర్చున్న కాంగ్రెస్ ? 

గత కొద్దిరోజులుగా ఏపీ అధికార పార్టీ వైసీపీలో( ycp ) చోటు చేసుకుంటున్న నియోజకవర్గ ఇంచార్జి ల మార్పు చేర్పుల వ్యవహారం పెద్ద సంచలనమే సృష్టిస్తోంది.పార్టీ సిట్టింగ్ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జిల పనితీరుపై సర్వేలు చేయించిన జగన్ .

 Turmoil In Jagan's Party Is Congress Sitting On The Boil , Ap Congress,ysrcp, Ap-TeluguStop.com

పనితీరు సక్రమంగా లేని వారిని తప్పించి వారి స్థానంలో కొత్త ఇన్చార్జిల నియామకానికి శ్రీకారం చుట్టిన సంగతి తెలిసిందే.దీంతో టిక్కెట్ దక్కని వారు , పార్టీలో అసంతృప్తికి గురైన వారు తమ పార్టీలోకి వస్తారని ఆశలతో ఏపీ కాంగ్రెస్ ( AP Congress )కాచుకు కూర్చుంది.

ఏపీలో కాంగ్రెస్ పరిస్థితి ఏమాత్రం ఆశాజనకంగా లేదు.ఏపీ తెలంగాణ విభజన తర్వాత పూర్తిగా ఏపీలో కాంగ్రెస్ కనుమరుగయింది .

Telugu Ap Congress, Ap, Ap Ap Cm Jagan, Ysrcp, Ysrcpconstency-Politics

ఆ పార్టీలో చెప్పుకోదగిన నేతలు కానీ ,గ్రామ ,నియోజకవర్గ స్థాయిలో కార్యకర్తలు గాని పెద్దగా లేరు.ఎక్కువమంది ప్రస్తుత అధికార పార్టీ వైసిపిలో చేరిన వారే.అయితే కర్ణాటక , తెలంగాణలో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారంలోకి రావడంతో,  ఇప్పుడు ఏపీలో కాంగ్రెస్ కు ఊపు తీసుకువచ్చేందుకు ఆ పార్టీ అగ్ర నేతలు ప్రయత్నాలు చేస్తున్నారు.దీనిలో భాగంగానే వైసీపీలోని అసంతృప్తులు , పార్టీ టికెట్ దక్కని వారు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్ లో చేరుతారని ఆశలు పెట్టుకుంది.

  ఎందుకంటే వీరిలో ఎక్కువమంది కాంగ్రెస్ నుంచి వైసీపీలో చేరిన వారే కావడంతో , తిరిగి కాంగ్రెస్ గూటికి వీరంతా వస్తారని ఆశలు పెట్టుకుంది.

Telugu Ap Congress, Ap, Ap Ap Cm Jagan, Ysrcp, Ysrcpconstency-Politics

ఈ మేరకు టికెట్ దక్కే ఛాన్స్ లేదని టెన్షన్ లో ఉన్న నేతలతో కాంగ్రెస్ కీలక నాయకులు కొంతమంది సంప్రదింపులు చేస్తున్నట్లు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది.ఇప్పటికే కొంతమంది ఎమ్మెల్యేలు తమతో టచ్ లో ఉన్నారంటూ ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు గిడుగు రుద్దరాజు( Gidugu Ruddaraju ) వ్యాఖ్యానించారు.ప్రస్తుతం వైసీపీలో ఇమడ లేని వారు టిడిపి, జనసేన వైపు వెళ్ళలేనివారు కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని, పార్టీకి తిరిగి పునర్వైభవం వస్తుందనే నమ్మకంతో ఉన్నారు.

Follow Us on FacebookFollow Us on WhatsAppFollow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube