Kantara Movie Rishab Shetty " కాంతారా' కోసం హోంబలే భారీ ప్లాన్స్.. వర్కౌట్ అయ్యేనా?

కన్నడ ఇండస్ట్రీ నుండి ఇటీవలే కాంతారా వంటి అద్భుతమైన బ్లాక్ బస్టర్ వచ్చింది.రిషబ్ శెట్టి దర్శకత్వం వహించి, నటించిన కాంతారా సినిమా కన్నడంలో రిలీజ్ అయ్యి రికార్డ్ స్థాయి వసూళ్లు సాధిస్తూ బాక్సాఫీస్ దగ్గర అసాధారణమైన విజయాన్ని నమోదు చేసుకుంది.

 Tulu Version Of Kantara, Kantara Movie, Rishab Shetty, Tulu Version, Hombale Fil-TeluguStop.com

కేవలం 16కోట్ల బడ్జెట్ తో తెరకెక్కిన ఈ సినిమా 400 వందల కోట్లకు పైగానే కలెక్ట్ చేసి నిర్మాతలకు భారీ లాభాలను తెచ్చిపెట్టింది.

ఇంత ఘనవిజయం సాధించిన నేపథ్యంలో స్టార్ హీరోలు సైతం ఈ సినిమా విజయాన్ని చూసి ఆశ్చర్య పోయారు.

కన్నడ ఇండస్ట్రీ నుండి ఎటువంటి హంగామా లేకుండా రిలీజ్ అయిన ఈ సినిమా ఇన్ని కోట్లు కలెక్ట్ చేయడం అనేది మాములు విషయం కాదు.ఇక ఇటీవలే ఈ సినిమా ఓటిటీలో కూడా స్ట్రీమింగ్ కు వచ్చింది.

అయితే థియేటర్స్ లో వచ్చిన రెస్పాన్స్ ఇక్కడ రావడం లేదు.

Telugu Hombale, Kantara, Rishab Shetty, Tulu, Tulu Kantara-Movie

ఓటిటి వేదికపై ఫ్యాన్స్ ఈ సినిమాలో ఉన్న నెగిటివ్ పాయింట్స్ ను వెతుకి మరీ చెబుతున్నారు. ఈ సినిమా రంగస్థలం ను పోలి ఉంది అని కొంత మంది అంటే.స్టార్టింగ్, క్లైమాక్స్ తప్ప ఈ సినిమాలో ఏమీ లేదని మరికొంత మంది చెబుతున్నారు.

ఇదిలా ఉండగానే ఈ సినిమాను నిర్మించిన హోంబలే ఫిలిమ్స్ వారు మరొక భారీ ప్రయోగం చేయబోతున్నారు.ఈ సినిమాను డిసెంబర్ 2న మేకర్స్ తులు భాషలో రిలీజ్ చేయబోతున్నారు.

ఇప్పటికే తెలుగు, కన్నడ, తమిళ్, మలయాళ, హిందీ భాషల్లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన ఈ సినిమా ఇప్పుడు తులు భాషలో కూడా రిలీజ్ చేస్తుండడం విశేషం.థియేటర్స్ లో అద్భుతాలు సృష్టిస్తున్న ఈ సినిమాను ఇంగ్లీష్ భాషలో కూడా రిలీజ్ చేయాలని మేకర్స్ ప్లాన్ అట.మరి వీరి ప్రయత్నాలు ఎంత వరకు ఫలిస్తాయో చూడాలి.

Follow Us on Facebook Follow Us on WhatsApp Follow Us on Twitter

తెలుగు వార్త విశేషాలు సులభముగా తెలుసుకోండి!!!!

ప్రతి రోజు ముఖ్యమైన వార్త విశేషాలు ,సినిమా,రాజకీయ విశ్లేషణలు,ఆరోగ్య సూత్రాలు,ఎన్నారై ,వీసా సమాచారం కోసం తెలుగుస్టాప్ డైలీకి Subscribe చేయండి,సోషల్ మీడియా లో ఫాలో అవ్వండి.మీ ఇమెయిల్/ఫోన్ నెంబర్(Country Code) తో నమోదు చేయండి.
Follow Us on Facebook Follow Us on WhatsApp  Follow Us on Twitter Follow Us on YouTube