తిరుమలలోని అలిపిరి నడకదారిలో భద్రత భక్తుల నేపథ్యంలో టీటీడీ ఆంక్షలు అమలులోకి వచ్చాయి.మధ్యాహ్నం నుంచి పిల్లలను అనుమతించబోమని టీటీడీ ఫ్లెక్సీలను ఏర్పాటు చేసింది.
సాయంత్రం కొండపైకి ద్విచక్ర వాహనాలకు అనుమతి నిరాకరించారు.కాగా తాజాగా టీటీడీ అమలు చేస్తున్న కొత్త ఆంక్షలతో నడకమార్గంలో భక్తుల సంఖ్య తగ్గిందని తెలుస్తోంది.
కాగా ఇటీవల నడక మార్గంలో మిస్ అయిన చిన్నారి లక్షిత చిరుత దాడి చేయడంతో మృత్యువాత పడిన సంగతి తెలిసిందే.ఈ ఘటనతో అప్రమత్తం అయిన టీటీడీ అధికారులు మరియు అటవీ శాఖ అధికారులు ప్రత్యేక దృష్టి సారించారు.
ఇందులో భాగంగానే పలు ఆంక్షలను అమల్లోకి తీసుకువచ్చిన సంగతి తెలిసిందే.