ట్రస్ట్ విరాళాలపై ఆరోపణలు చేస్తున్న వారికి టీటీడీ ఈవో సవాల్

తిరుమలలోని శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై ఆరోపణలు చేస్తున్న వారికి టీటీడీ ఈవో ధర్మారెడ్డి ఛాలెంజ్ చేశారు.

విరాళాలపై ఆరోపణలు చేసే వారంతా తమ ఆడిటర్లతో వచ్చి శ్రీవాణి ట్రస్ట్ నిధుల నిర్వహణ తీరును పరిశీలించుకోవచ్చని టీటీడీ ఈవో సవాల్ చేశారు.

గత యాభై ఏళ్లలో టీటీడీ పరిపాలనలో ఎలాంటి అవినీతి జరగలేదన్న ఆయన అవినీతి జరిగేందుకు ఎలాంటి ఆస్కారం ఉండదని చెప్పారు.శ్రీవాణి ట్రస్ట్ విరాళాలపై రాజకీయ ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు.ఇప్పటివరకు ట్రస్ట్ కు రూ.860 కోట్ల విరాళాలు అందాయని, ఆ విరాళాలతో పారదర్శకంగా 2,445 ఆలయాల నిర్మాణం ప్రారంభించామని తెలిపారు.ఎస్సీ, ఎస్టీ, బీసీ కాలనీల్లో ఆలయాల ధూప, దీప, నైవేద్యాలకు ప్రతీ నెలా రూ.5 వేలు చొప్పున చెల్లిస్తున్నామని స్పష్టం చేశారు.

హెచ్ఎంపీవీ వైరస్ లక్షణాలు ఏంటి? వైరస్ బారిన పడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలివే?

Latest Latest News - Telugu News