తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు పవిత్ర పుణ్యక్షేత్రం తిరుపతికి సంబంధించిన పెట్టుబడులు, డిపాజిట్లపై శ్వేతపత్రాన్ని విడుదల చేసింది.పూర్తి అస్తుల వివరాలను చూస్తే.30 సెప్టెంబర్ 2022 నాటికి TTD వద్ద రూ.15,938 కోట్ల బ్యాంకు పెట్టుబడులు ఉన్నాయని టీటీడీ పేర్కొంది.ఈ నిధులు 24 వేర్వేరు బ్యాంకు ఖాతాల్లో ఉన్నాయని తెలిపింది.ఇక 30 జూన్ 2019 నాటికి TTD వద్ద రూ.13,025 కోట్ల వరకు అస్తులు ఉన్నట్లు వివరించింది. ఇప్పుడు ఆ అస్తులు విలువ రూ.15,938 కోట్ల వరకు పెరిగాయి, ఇది గత మూడేళ్లుగా TTD ఆస్తుల విలువ గణనీయంగా పెరిగాయని తెలిపింది.అలాగే రెండు బ్యాంకుల్లో 10,258 కిలోల బంగారం డిపాజిట్లు ఉన్నాయని టీటీడీ ప్రకటించింది.
ఇది 2019లో ఉన్న 7339 కిలోల కంటే స్వల్పంగా పెరిగింది.టిటిడి బోర్డు, ఛైర్మన్, టిటిడి భారత ప్రభుత్వ సెక్యూరిటీలలో లేదా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు సోషల్ మీడియాలో వ్యాపించిన పుకార్లు పూర్తిగా టిటిడి తెలిపింది.
టీటీడీ బోర్డు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సెక్యూరిటీలలో పెట్టుబడులు పెట్టకూడదని స్పష్టంగా నిర్ణయించుకున్నట్లు స్పష్టం చేసింది.
కరోనా లాక్‌డౌన్ వంటి అంతరాయాలు ఉన్నప్పటికీ వెంకటేశ్వర స్వామి సంపద పెరిగింది.7,123 ఎకరాల్లో మొత్తం 960 స్థిరాస్తులు ఉన్నాయని, వాటి విలువ దాదాపు రూ.85,705 కోట్లని టీటీడీ ప్రకటించింది.టిటిడి అధికారిక వెబ్‌సైట్‌లో టిటిడి ఆస్తుల వివరాలతో శ్వేతపత్రాన్ని విడుదల చేస్తున్నట్లు టీటీడీ ప్రకటించింది.పలు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న ఆస్తుల విలువను స్థానిక రెవెన్యూ అధికారులు అంచనా వేసినట్లు సమాచారం.

ఇక తిరుమల కొండలలో ఉన్న స్థిరాస్తులను పై జాబితాలో చేర్చబడలేదు, ఎందుకంటే తిరుమల కొండలలోని శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయం చుట్టూ ఉన్న 10.33 చదరపు మైళ్ల విస్తీర్ణంలో తిరుమల తిరుపతి దేవస్థానం ప్రత్యేక ఆస్తిగా ఉంటుందని టీటీడీ పేర్కొంది.TTD వద్ద అందుబాటులో ఉన్న నికర స్థిరాస్తులు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, కేరళ, పుదుచ్చేరి, తమిళనాడు, మహారాష్ట్ర, ఒడిశా, నేపాల్‌లో విస్తరించి ఉన్న ప్లాట్లు, ఇళ్లు, కార్యాలయాలు, దేవాలయాలు, దుకాణాలు, ఇతర భవనాలు ఉన్నాయి.