అల్లు అర్జున్ కి సజ్జనార్ షాక్.. టీఎస్ఆర్టీసీ నుంచి నోటీసులు?

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కు టిఎస్ ఆర్టిసి నుంచి చేదు అనుభవం ఎదురైంది.

ఈ క్రమంలోనే తెలంగాణ ఆర్టిసి ఎండి సజ్జనార్ అల్లు అర్జున్ కు లీగల్ నోటీసులు పంపించారు.

అసలు అల్లు అర్జున్ కు లీగల్ నోటీసు పంపించడానికి కారణం ఏమిటి అనే విషయానికి వస్తే.అల్లు అర్జున్ పలు సినిమాలతో పాటు పలు బ్రాండ్లకు అంబాసిడర్ గా వ్యవహరిస్తున్న సంగతి మనకు తెలిసిందే.

ఈ క్రమంలోనే అల్లు అర్జున్ ర్యాపిడో యాడ్ లో నటిస్తూ ఆర్టీసీని కించపరిచారంటూ సజ్జనార్ అల్లు అర్జున్ కు లీగల్ నోటీసులు పంపించారు.ఈ క్రమంలోనే అల్లు అర్జున్ దోసెలు వేస్తూ ఎందుకొచ్చిన పేరంట అండీ ర్యాపిడో బుక్ చేసుకోండి చెమటలు పెట్టకుండా వెళ్ళండి అంటూ అల్లు అర్జున్ చేసిన ఈ యాడ్ పై తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు.

ఆర్టీసీ బస్సులు సాధారణ దోశల మాదిరి ఎక్కువ సమయం తీసుకుంటాయి అని ఆర్టీసీ సేవలను అవమాన పరిచారని అందుకు అల్లు అర్జున్ క్షమాపణ చెప్పాలని తెలంగాణ ఆర్టీసీ ఉద్యోగులు డిమాండ్ చేశారు.ఈ క్రమంలోనే ఆర్టిసి ఎండీ మాట్లాడుతూ అల్లు అర్జున్ ఈ ప్రకటన పై ఆర్టీసీ ఉద్యోగులు, అభిమానులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారని వెల్లడించారు.

Advertisement

అదే విధంగా ర్యాపిడో యాడ్ చేస్తూ ఆర్టిసిని కించపరుస్తున్నారని, ప్రజా రవాణాను ప్రోత్సహించే ప్రకటనలలో నటిస్తూ ప్రజలలో అవగాహన వచ్చే ప్రకటనలలో నటించాలి కానీ ఇలా ఒక సంస్థను కించపరిచే విధంగా నటించడం సరికాదని టీఎస్ ఆర్టీసీ సామాన్యుల సేవలో ఉందని ఇలా పబ్లిక్ ప్రాపర్టీని కించపరచినందుకు అల్లుఅర్జున్ లీగల్ నోటీసులు పంపిస్తున్నట్లు తెలంగాణ ఆర్టీసీ ఎండి సజ్జనార్ ప్రకటనలో తెలియజేశారు.ఏది ఏమైనా అల్లు అర్జున్ కు ఇది ఒక షాకింగ్ న్యూస్ అని చెప్పవచ్చు.ఇక సినిమాల విషయానికొస్తే అల్లు అర్జున్ పుష్ప సినిమాలో నటిస్తున్న సంగతి తెలిసిందే.

కూతురి పెళ్లి వీడియో షేర్ చేసిన అర్జున్ సర్జా... మాటలు రావడం లేదంటూ పోస్ట్?
Advertisement

తాజా వార్తలు