జనవరిలో జేఎల్‌ఎం, జూనియర్ అసిస్టెంట్ పోస్టులను భర్తీ చేయనున్నట్లు టీఎస్ ఎస్‌పీడీసీఎల్ సీఎండీ జి.రఘుమారెడ్డి చెప్పారు.మహబూబ్‌నగర్‌లోని విద్యుత్ భవన్‌లో సోమవారం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన ప్రభుత్వం నుంచి విధి విధానాలు అందిన వెంటనే కింది స్థాయి సిబ్బందిని భర్తీ చేసేందుకు ప్రణాళిక రూపొందించనున్నట్టు వివరించారు.2500 జేఎల్‌ఎం, 500 జూనియర్ అసిస్టెంట్ పోస్టుల భర్తీ కి త్వరలో నోటిఫికేషన్ విడుదల చేసే అవకాశం ఉందన్నారు.
.






