గవర్నర్ కోటా ఎమ్మెల్సీల( Governor Quota MLCs ) ప్రమాణస్వీకారానికి తెలంగాణ హైకోర్టు బ్రేక్ వేసింది.తదుపరి ఉత్తర్వులు ఇచ్చేంత వరకు కొత్త ఎమ్మెల్సీలతో ప్రమాణస్వీకారం చేయించొద్దని న్యాయస్థానం తెలిపింది.
అనంతరం తదుపరి విచారణను హైకోర్టు( TS High Court ) ఫిబ్రవరి 8వ తేదీకి వాయిదా వేసింది.అయితే తమ కేసు విచారణ తేలేంత వరకు ఎమ్మెల్సీల నియామకంపై స్టే ఇవ్వాలని కోరుతూ దాసోజు శ్రవణ్, సత్యనారాయణ హైకోర్టు( Dasoju Sravan Kumar )లో పిటిషన్ దాఖలు చేసిన సంగతి తెలిసిందే.ఈ పిటిషన్ పై ఇరు పక్షాల వాదనలు విన్న న్యాయస్థానం కొత్త ఎమ్మెల్సీల ప్రమాణస్వీకారానికి బ్రేక్ వేసింది.