లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను కోరుకుంటున్నారా.. అయితే మీరీ మ్యాంగో మాస్క్ ను తప్పక ట్రై చేయండి!

పిల్లల నుంచి పెద్దల వరకు దాదాపు అందరూ ఎంతో ఇష్టంగా తినే ఫ్రూట్స్ లో మామిడి పండ్లు( Mangoes ) ముందు వరుసలో ఉంటాయి.

రుచి పరంగా మామిడి పండ్లకు మరొకటి సాటి ఉండదు.

అలాగే ఆరోగ్యానికి మామిడి పండ్లు ఎంతో మేలు చేస్తాయి.అంతే కాదండోయ్ కేశ సంరక్షణకు( Hair Care ) సైతం మామిడి పండ్లు సహాయపడతాయి.

ముఖ్యంగా లాంగ్ అండ్ స్ట్రాంగ్ హెయిర్ ను కోరుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే మ్యాంగో మాస్క్ ఉత్తమంగా సహాయపడుతుంది.అందుకోసం ముందుగా ఒక మామిడి పండును తీసుకుని పీల్ తొలగించి ముక్కలుగా కట్ చేసుకోవాలి.

ఆ తర్వాత మిక్సీ జార్ తీసుకొని అందులో కట్ చేసి పెట్టుకున్న మామిడి పండు ముక్కలు వేసి స్మూత్ గా గ్రైండ్ చేసుకోవాలి.ఇలా గ్రైండ్ చేసుకున్న మామిడి పండు మిశ్రమంలో ఒక ఎగ్ వైట్ ను( Egg White ) వేసుకోవాలి.

Advertisement

అలాగే రెండు టేబుల్ స్పూన్లు పెరుగు( Curd ) వేసుకుని అన్నీ కలిసేలా బాగా మిక్స్ చేసుకోవాలి.

ఇప్పుడు ఈ మిశ్రమాన్ని జుట్టు కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి షవర్ క్యాప్ ధరించాలి.గంట అనంతరం మైల్డ్ షాంపూను ఉపయోగించి శుభ్రంగా తల స్నానం చేయాలి.వారానికి ఒకసారి ఈ మ్యాంగో మాస్క్( Mango Mask ) వేసుకోవడం వల్ల చాలా ప్రయోజనాలు ఉన్నాయి.

మామిడి పండులో వివిధ రకాల విటమిన్లు ఉంటాయి.ఇవి జుట్టుకు మంచి పోషణను అందిస్తాయి.

మామిడిలో ఉండే విటమిన్ సి జుట్టు పెరుగుదలకు( Hair Growth ) తోడ్పడే సెబమ్ ను ఉత్పత్తి చేస్తుంది.అలాగే పెరుగు, గుడ్డులో ఉండే ప్రోటీన్లు మరియు ఇతర పోషకాలు జుట్టును దృఢంగా మారుస్తాయి.హెయిర్ ఫాల్ ను అరికడతాయి.

అఖిల్ జైనాబ్ పెళ్లి అప్పుడేనట.. మూడు నెలల గ్యాప్ లో అక్కినేని హీరోల పెళ్లి జరగనుందా?
ఎంతో టాలెంట్ ఉన్నా లక్ లేక వెనుకబడిన సత్యదేవ్.. లక్ కలిసిరావట్లేదా?

మొత్తంగా ఈ మ్యాంగో మాస్క్ వేసుకోవడం వల్ల మీ జుట్టు పొడుగ్గా ఒత్తుగా పెరుగుతుంది.బలహీనమైన కురులు దృఢంగా మారతాయి.

Advertisement

జుట్టు రాలడం సైతం కంట్రోల్ అవుతుంది.

తాజా వార్తలు