క్యారెట్ తో ఆరోగ్యమే కాదు జుట్టును కూడా పెంచుకోవ‌చ్చు.. ఇంతకీ ఎలా వాడాలంటే?

మన ఆరోగ్యానికి అత్యంత మేలు చేసే దుంపల్లో క్యారెట్( Carrot ) ఒకటి.చాలా మంది నిత్యం పచ్చి క్యారెట్ తింటూ ఉంటారు.

ఇంకొందరు జ్యూస్ రూపంలో తీసుకుంటారు.ఎలా తీసుకున్న లాభాలు మాత్రం దండిగా ఉంటాయి.

అయితే క్యారెట్ తో ఆరోగ్యాన్నే కాదు జుట్టును కూడా పెంచుకోవచ్చు.పొడవాటి ఒత్తైన జుట్టును( Thick Hair ) కోరుకునే వారికి ఇప్పుడు చెప్పబోయే క్యారెట్ ఆయిల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది.

ఆయిల్ తయారీ కోసం ముందుగా ఒక క్యారెట్ ను తీసుకొని పీల్ తొలగించి వాటర్ తో శుభ్రంగా కడిగి సన్నగా తురుముకోవాలి.ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకుని అందులో ఒక గ్లాసు కొబ్బరి నూనె( Coconut Oil ) పోసుకోవాలి.

Advertisement

అలాగే క్యారెట్ తురుము, వన్ టేబుల్ స్పూన్ అల్లం ముక్కలు, రెండు బిర్యానీ ఆకులు మరియు వన్ టేబుల్ స్పూన్ కలోంజి సీడ్స్ వేసి గరిటెతో తిప్పుకుంటూ ఉడికించాలి.దాదాపు 15 నిమిషాల పాటు ఉడికిస్తే మన ఆయిల్ అనేది రెడీ అవుతుంది.

స్టవ్ ఆఫ్ చేసుకుని ఆయిల్ ను చల్లార బెట్టుకోవాలి.పూర్తిగా కూల్ అయ్యాక స్ట్రైనర్ సహాయంతో ఆయిల్ ను ఫిల్టర్ చేసుకుని బాటిల్ లో స్టోర్ చేసుకోవాలి.జుట్టు పెరుగుదలకు ఈ క్యారెట్ ఆయిల్( Carrot Oil ) చాలా అద్భుతంగా సహాయపడుతుంది.

స్కాల్ప్ తో పాటు జుట్టు మొత్తానికి క్యారెట్ ఆయిల్ ను అప్లై చేసుకుని మసాజ్ చేసుకోవాలి.ఆయిల్ రాసుకున్న నాలుగు గంటల తర్వాత లేదా మరుసటి రోజు తేలికపాటి షాంపూ ను ఉపయోగించి తల స్నానం చేయాలి.

క్యారెట్ ఆయిల్ జుట్టుకు చక్కని పోషణ అందిస్తుంది.జుట్టు పొడుగ్గా మరియు ఒత్తుగా పెరగడానికి సహాయపడుతుంది.క్యారెట్ ఆయిల్ జుట్టు మూలాలను బలోపేతం చేస్తుంది మరియు జుట్టు రాలడాన్ని నివారిస్తుంది.

పిల్లి గీరడంతో మృతి చెందిన రష్యన్ వ్యక్తి.. షాక్‌లో ఫ్యామిలీ!
కుబేరపచ్చ కుంకుమతో లక్కే లక్కు.. అసలు ఇది ఎలా పుట్టిందంటే

అంతేకాకుండా క్యారెట్ ఆయిల్ యొక్క మాయిశ్చరైజింగ్ లక్షణాలు జుట్టు పొడిబారడాన్ని , చిట్లడాన్ని నివారిస్తాయి.క్యారెట్ ఆయిల్ జుట్టును మెరిసేలా, మృదువుగా సైతం మారుస్తుంది.

Advertisement

తాజా వార్తలు